అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mojtaba Khamenei | ఇరాన్ (Iran) సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ముస్లిం దేశాలకు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. అమెరికా (America), ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఆ ప్రాంతంలోని ముస్లిం దేశాలు ఏకం కావాలన్నారు.
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. అనంతరం మొజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్ అయ్యారు. అయితే ఆయన ఇంత వరకు బహిరంగంగా కనిపించలేదు. అప్పుడప్పుడు ప్రకటనలు విడుదల చేస్తున్నారు. తాజాగా మహమ్మద్ జన్మదినాన్ని జరుపుకుంటున్న తరుణంలో ఆదివారం లిఖితపూర్వక సందేశం ఇచ్చారు. ఇస్లామిక్ దేశాల సమస్యలకు పరిష్కారం కోసం మాటల ఐక్యత, స్నేహం, మంచి మార్గంలో సహకారం అవసరం అన్నారు.
Mojtaba Khamenei | శత్రువులకు సేవ చేసినట్లే..
ఏ పదవిలో ఉన్నవారైనా ముస్లింల మధ్య విభజనకు దారితీసే, సంఘర్షణను సృష్టించే పని చేస్తే, వారు ఇస్లాం శత్రువుల ప్రయోజనాలకు సేవ చేసినవారే అవుతారని పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌లను ఉద్దేశిస్తూ నిజమైన శత్రువును గుర్తించాలని ముస్లిం దేశాలకు ఆయన సూచించారు. దాని ప్రణాళికను అర్థం చేసుకొని, ఎదుర్కోవాలన్నారు. కాగా యుద్ధ సమయంలో ఇరాన్ (Iran), సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), జోర్డాన్, కువైట్, ఖతార్, బహ్రెయిన్‌తో సహా మధ్యప్రాచ్యం అంతటా ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న విషయం తెలిసిందే.
Mojtaba Khamenei | అధికారులు, ప్రజలు ఏకం కావాలి
విభేదాలను పక్కనపెట్టి ఇరాన్ అధికారులు, పౌరులు ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా ఏకం కావాలని ఖమేని పిలుపునిచ్చారు. తమలో తాము ఏ విధంగానూ ఎలాంటి విభేదాలు తలెత్తకుండా చూసుకోవాని సూచించారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను క్రమంగా డాలర్ రహితం చేయాలని, వృద్ధికి మద్దతుగా ఆర్థిక ఉత్పత్తిని పెంచాలని శుక్రవారం ఆయన వ్యాఖ్యానించారు.
దీనిని కూడా చదవండి : Azambad land | రియల్ ఎస్టేట్ ఏజెన్సీగా మారిన ప్రభుత్వం : హరీశ్‌రావు