అక్షరటుడే, వెబ్‌డెస్క్: Saudi Defense Pact | పాకిస్థాన్ (Pakistan), సౌదీ అరేబియా, టర్కీ చారిత్రక రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ పేరుతో త్రైపాక్షిక ఒప్పందంపై శుక్రవారం సంతకం చేశాయి. దీని ప్రకారం ఏ దేశంపై దాడి జరిగినా మూడింటిపై జరిగిన దాడిగా పరిగణించనున్న దేశాలు.
ఈ ఒప్పందం ద్వారా ఉమ్మడి సైనిక విన్యాసాలు, రక్షణ దళాలకు ప్రత్యేక శిక్షణ నిర్వహించనున్నారు మూడు దేశాల మధ్య టెక్నాలజీ, నిఘా సమాచార మార్పిడి మార్గం సుగమం కానుంది. మూడు దేశాల్లో పాక్‌కు మాత్రమే అణ్వాయుధ సామర్థ్యం ఉండటం గమనార్హం. పెరుగుతున్న భద్రతాపరమైన ఆందోళనల తరుణంలో ఈ ఒప్పందం మూడు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
Saudi Defense Pact | సౌదీ ముందుచూపు
ఏ విధమైన దురాక్రమణ చర్యకైనా వ్యతిరేకంగా సామూహిక నిరోధక శక్తిని బలోపేతం చేయడమే ఈ ఒప్పందం ఉద్దేశమని పాక్ తెలిపింది. మూడు దేశాలలో దేనిపైనైనా జరిగే సాయుధ దాడిని, అన్ని దేశాలపై జరిగిన దాడిగా పరిగణించాలని ఇది నిర్దేశిస్తుందని పేర్కొంది. సౌదీ అరేబియాలో సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌ల మధ్య జరిగిన సమావేశంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఇరాన్‌తో యుద్ధంలో భాగంగా అనేక దాడులకు గురైన సౌదీ అరేబియా, తన రక్షణ భాగస్వామ్యాలను విస్తరించుకోవాలని చూస్తోంది. దాని కీలక మౌలిక సదుపాయాలు, చమురు సౌకర్యాలు, ఇరాన్, హౌతీలు, ఇరాకీ మిలీషియాల వంటి దాని ప్రాంతీయ మిత్రదేశాల నుండి పదేపదే డ్రోన్ మరియు క్షిపణి దాడులను ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో వ్యూహాత్మకంగా సౌదీ ఈ ఒప్పందంపై సంతకం చేసింది.
ఇది కూడా చదవండి : Fake Currency Gang | ఇంట్లోనే నకిలీ కరెన్సీ తయారీ.. వైన్ షాపుల్లో చలామణి