అక్షరటుడే వెబ్‌డెస్క్: Nirmal Purja Avalanche | పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ( Kashmir ) కారకోరం పర్వత శ్రేణిలో ఉన్న బ్రాడ్ పీక్ పర్వతం వద్ద సంభవించిన భారీ హిమపాతంలో ప్రముఖ పర్వతారోహికుడు నిర్మల్ పుర్జా ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని శనివారం అధికారులు అధికారికంగా ధృవీకరించారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య ఐదుకి చేరింది.
Nirmal Purja Avalanche | అసలేం జరిగిందంటే..?
పీవోకేలోని 8,051 మీటర్ల ఎత్తైన బ్రాడ్ పీక్ పర్వతాన్ని అధిరోహించేందుకు నేపాలీ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా(43) నేతృత్వంలో 9 మంది సభ్యుల బృందం గురువారం బయలుదేరింది. వీరు దాదాపు 7 వేల మీటర్ల ఎత్తుకు చేరుకున్న సమయంలో భారీ హిమపాతం సంభవించడంతో అంతా గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్ వెంటనే సహాయక చర్యలు చేపట్టాయి. శుక్రవారం సాయంత్రం వరకు నలుగురు మృతదేహాలను వెలికితీశారు. శనివారం నాటికి నిర్మల్ పుర్జా మృతదేహం కూడా లభ్యమైంది. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మిగిలిన వారి కోసం కొనసాగుతున్న సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. హిమపాతంలో చిక్కుకున్న ఈ బృందంలో ఆరుగురు నేపాలీలతో పాటు పాక్, ఒమన్, అమెరికా, చైనాలకు చెందిన పర్వతారోహకులు ఉన్నారు.
Nirmal Purja Avalanche | ఎవరీ నిర్మల్ పుర్జా..?
ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుడైన నిర్మల్ పుర్జా.. 2019లో కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ప్రపంచంలోని 8 వేల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న 14 శిఖరాలన్నింటినీ అధిరోహించి అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించారు. అంతకుముందు ఈ రికార్డు దక్షిణ కొరియా పర్వతారోహకుడు కిమ్ చాంగ్-హో పేరిట ఉండేది (ఆయన ఈ రికార్డు సాధించేందుకు ఏడేళ్లు పట్టింది). పుర్జా పర్వతారోహకుడిగా మారడానికి ముందు 16 సంవత్సరాలు బ్రిటిష్ సైన్యంలో (మొదట గూర్ఖా బ్రిగేడ్, ఆ తర్వాత రాయల్ నేవీ స్పెషల్ బోట్ సర్వీస్) విధులు నిర్వర్తించారు.
ఇది కూడా చదవండి: West Bengal Terror Plot | బెంగాల్‌లో భారీ ఉగ్ర కుట్ర.. భగ్నం చేసిన టాస్క్ ఫోర్స్