అక్షరటుడే వెబ్‌డెస్క్: Malappuram Explosives Case | కేరళలోని మలప్పురంలో భారీ ఎత్తున చట్టవిరుద్ధమైన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో సంబంధం ఉన్న హారీస్ టీఏ అనే నిందితుడిని మలప్పురం జిల్లాలోని మంజేరి వద్ద శనివారం అధికారులు అరెస్టు చేశారు. ఈ కుట్రలో ప్రధాన నిందితులలో ఒకడైన హారీస్, పేలుడు పదార్థాల అక్రమ సేకరణలో కీలక పాత్ర పోషించినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. ఈ తాజా అరెస్టుతో ఈ కేసులో అదుపులోకి తీసుకున్న వారి మొత్తం సంఖ్య పదికి చేరింది.
Malappuram Explosives Case |కేసు నేపథ్యం..
ఈ కేసుకు సంబంధించి ఫిబ్రవరి 7, 2026న ఎన్‌ఐఏ కేసు (RC-01/2026/NIA/KOC) నమోదు చేసింది. మలప్పురంలోని చెమ్మద్-తల్పార రోడ్డులో ఉన్న ‘ఫర్హా హాలో బ్రిక్స్’ కంపెనీ ప్రాంగణంలో నిలిపి ఉంచిన ఒక లారీని అధికారులు తనిఖీ చేశారు. ఆ సమయంలో భారీగా పేలుడు పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో ఏకంగా 89,600 ఎక్స్‌ప్లోజివ్ స్టిక్స్ (పేలుడు కడ్డీలు), 10,500 షాక్ ట్యూబ్‌లను (NONEL) సీజ్ చేశారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న విస్తృత నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ అధికారులు ప్రస్తుతం కూపీ లాగుతున్నారు.
ఇది కూడా చదవండి: Lal Darwaza Bonalu | ఘనంగా లాల్‌దర్వాజ బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ