అక్షరటుడే, వెబ్‌డెస్క్ : JSSC CGL Paper Leak | జార్ఖండ్ (Jharkand) స్టాఫ్ సెలక్షన్ కమిషన్-కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (JSSC-CGL) పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. 2024లో జరిగిన ఈ పరీక్ష పేపర్ ఎలా లీక్ అయిందో తాజాగా ఓ వెలుగులోకి వచ్చింది.
JSSC పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని, వాట్సాప్ ద్వారా అవి ప్రచారమయ్యాయని ఆ నివేదిక పేర్కొంది. డబ్బు చెల్లించిన వారికి హజారీబాగ్, జంషెడ్‌పూర్, పాట్నా, పశ్చిమ బెంగాల్, నేపాల్ వంటి ప్రాంతాలలో సమాధానాలు అందించారు. 2025లో రాష్ట్ర ప్రభుత్వం ఆ నివేదికను పక్కనపెట్టి, రెండోసారి విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో పేపర్ లీక్ ఆరోపణలను తోసిపుచ్చి, పరీక్ష ప్రక్రియ సక్రమంగా జరిగిందని పేర్కొనడం గమనార్హం.
JSSC CGL Paper Leak | రెండోసారి లీక్
పేపర్ లీక్ ఆరోపణల కారణంగా గతంలో ఒకసారి రద్దయిన తర్వాత, JSSC పరీక్షను 2024 సెప్టెంబర్ 21, 22 తేదీలలో మళ్లీ నిర్వహించారు. ఆ సమయంలో పేపర్ లీక్ కాకుండా జార్ఖండ్ అంతటా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అయినా.. పేపర్ లీక్ కావడం గమనార్హం. ల్యాండ్‌లైన్ ఫోన్ల ద్వారా సమాధానాలు అందుబాటులో ఉంచారని, కొన్ని సందర్భాల్లో వాటిని నేరుగా చదివి వినిపించారని సమాచారం. 150 ప్రశ్నల్లో 120 లీక్ అయినట్లు సీఐడీ ప్రాథమిక నివేదికలో తెలిపింది. సీఐడీ నివేదిక అనంతరం ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. పేపర్ లీక్ జరగలేదని సిట్ పేర్కొనడం గమనార్హం. దీంతో విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు.
దీనిని కూడా చదవండి : Lal Darwaza Bonalu | ఘనంగా లాల్‌దర్వాజ బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ