Lal Darwaza Bonalu | ఘనంగా లాల్​దర్వాజ బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న విజయ్​ దేవరకొండ

లాల్​దర్వాజ బోనాల సందర్భంగా సింహవాహిని అమ్మవారిని విజయ్​ దేవరకొండ దర్శించుకున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lal Darwaza Bonalu | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో బోనాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఆషాఢ చివరి ఆదివారం కావడంతో పాతబస్తీలో లాల్​ దర్వాజ బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

లాల్ దర్వాజ సింహవాహిని ఆలయానికి ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. పాత బస్తీలో బోనాల సందడి నెలకొంది. భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్​ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఆ మార్గంలో వాహనాలు అనుమతించడం లేదు.

Lal Darwaza Bonalu | విజయ్​ పూజలు

బోనాల పండుగ సందర్భంగా లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారిని హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, హీరో ఆనంద్ దేవరకొండ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకుని భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. భద్రకాళి ప్రొడక్షన్ పేరు మీద పూజ చేయించామని విజయ్​ తెలిపారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

దీనిని కూడా చదవండి : Irrigation Projects | ప్రాజెక్టుల భూ సేకరణకు నిధులు : మంత్రి ఉత్తమ్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *