Constable Suicide | యువతికి ఫోన్​ చేసి.. కానిస్టేబుల్​ ఆత్మహత్య

మలక్​పేటలో ఓ పోలీస్​ కానిస్టేబుల్​ ఆత్మహత్య చేసుకున్నాడు. శాలివాహన నగర్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Constable Suicide | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని మలక్​పేటలో ఓ పోలీస్​ కానిస్టేబుల్​ ఆత్మహత్య చేసుకున్నాడు. మూసారాంబాగ్ శాలివాహన నగర్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

ముత్తె చంద్రశేఖర్ (35) అంబర్‌పేట్ హెడ్‌క్వార్టర్స్‌లో కానిస్టేబుల్ రైటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం రాత్రి ఆయన ఓ యువతికి వీడియో కాల్ చేశాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమెకు చెప్పాడు. దీంతో వెంటనే ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. మలక్​పేట పోలీసులు ఘటన స్థలానికి చేరుకునే లోపే చంద్రశేఖర్​ ఉరి వేసుకున్నాడు.

Constable Suicide | కేసు నమోదు..

పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన మృతికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. కానిస్టేబుల్ మృతితో స్థానికంగా విషాదఛాయలు అములుకున్నాయి.

ఇది కూడా చదవండి..: Indiramma Towers | హైదరాబాద్​లో ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్​డేట్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *