అక్షరటుడే, వెబ్‌డెస్క్: Cases on Farmers | జూరాల ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేసి బీఆర్ఎస్ నేతలను, రైతులను అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. రాష్ట్రంలో సాగుతున్న అణచివేతకు ఇది ఉదాహరణ అని ఆయన అన్నారు.
జూరాల ఆయకట్టుకు నీరందించాలని బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు పలువురు నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. జూరాల ప్రాజెక్ట్‌కు వెళ్లే మార్గాలను మూసి వేశారు. దీనిపై ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలను కాపాడుకోవడానికి రైతులు జూరాల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తే.. ప్రభుత్వం వారిపై అక్రమ కేసులు పెట్టిందని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నదాతలను అరిగోస పెడుతున్నారని పేర్కొన్నారు.
Cases on Farmers | పాలన చేతగాక..
సీఎం రేవంత్‌రెడ్డికి పాలన చేతగాక, బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలకు ఆదేశాలిచ్చారని విమర్శించారు. జూరాల ప్రాజెక్టులో 9 టీఎంసీల నీరు ఉందని, తాగునీటికి 2 టీఎంసీలు సరిపోతాయన్నారు. అయినా కూడా రైతులకు సాగునీరు విడుదల చేయకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్నారు. అరెస్టు చేసిన రైతులను, బీఆర్ఎస్ నేతలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి..: Danam Nagender | దానం నాగేందర్ అనర్హత కేసులో బిగ్ అప్డేట్..బుధవారం సుప్రీంకోర్టులో విచారణ