Saraswati Pushkaralu | సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Saraswati Pushkaralu | సరస్వతి నది అంత్య పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం 5.43 గంటలకు పుష్కరాలను ప్రారంభించారు.

కాళేశ్వరం (Kaleshwaram)లోని త్రివేణి సంగమం వద్ద సరస్వతి పుష్కరాలను 12 ఏళ్లకు ఒకసారి ఘనంగా నిర్వహిస్తారు. గతేడాది మే 15 నుంచి మే 26 వరకు పుష్కరాలు నిర్వహించారు. అయితే తాజాగా అంత్యపుష్కరాలను మంత్రులు ప్రారంభించారు. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామిజీ, ఐటి పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు శ్రీ గోవింద హరి తదితరులు పుణ్యస్నానాలు ఆచరించి పుష్కరాలను ప్రారంభించారు. భూపాలపల్లి, రంగారెడ్డి ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ రావు, మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు.

Saraswati Pushkaralu | తరలి వచ్చిన భక్తులు

సరస్వతి నది అంత్య పుష్కరాలు మే 21 నుంచి జూన్​ 1 వరకు సాగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. పుష్కరాల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. భద్రత, పారిశుధ్యం, తాగునీరు, వైద్య సేవలు, రవాణా వంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. భక్తులు సౌకర్యవంతంగా, సురక్షితంగా పుష్కర స్నానాలు నిర్వహించుకునేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.

ఇది కూడా చదవండి..: Telangana Heat Wave | భానుడి భగభగలు.. పెరగనున్న ఎండ తీవ్రత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *