Deloitte Visakhapatnam | విశాఖకు మరో ఐటీ దిగ్గజం.. డెలాయిట్ ఎంట్రీకి సన్నాహాలు.. ఐటీ హబ్‌గా దూసుకెళ్తున్న సాగర నగరం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Deloitte Visakhapatnam | ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని విశాఖపట్నం నగరం ఐటీ రంగానికి కీలక కేంద్రంగా మారుతోంది. గత కొంతకాలంగా ప్రముఖ ఐటీ సంస్థలు వరుసగా విశాఖలో తమ కార్యకలాపాలను విస్తరిస్తుండటంతో నగరం ఐటీ హబ్‌గా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థలు విశాఖలో తమ ఉనికిని బలపరిచాయి.

ఇప్పుడు ఆ జాబితాలో మరో అంతర్జాతీయ సంస్థ చేరబోతోందన్న వార్త ఆసక్తిని కలిగిస్తోంది. డెలాయిట్ సంస్థ విశాఖపట్నంలో తన శాటిలైట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. టైర్-2 నగరాల్లో తమ కార్యకలాపాలను విస్తరించడంపై డెలాయిట్ కొంతకాలంగా దృష్టి పెట్టిన నేపథ్యంలో విశాఖను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

Deloitte Visakhapatnam | పెట్టుబ‌డుల‌కి అనుకూలంగా మారే దిశ‌గా..

విశాఖలోని రుషికొండ ఐటీ హిల్స్ ప్రాంతంలో సంస్థ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు విశాఖపట్నం, మంగళూరు వంటి నగరాలకు రీలొకేషన్‌పై ఆసక్తి ఉందా అని మెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది. విశాఖ కేంద్రంగా డెలాయిట్ ముఖ్యంగా ఐటీ కన్సల్టింగ్, టెక్నాలజీ సేవలు, గ్లోబల్ ఫైనాన్స్ ఆపరేషన్స్, బీపీవో సేవలను అందించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇది ఉద్యోగ అవకాశాలను పెంచడంతో పాటు నగర ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడే అవకాశముంది.

Deloitte Visakhapatnam | గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా

ఇక మరోవైపు రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME) అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ నెల 25న విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో ‘MSME గ్రోత్ కాన్‌క్లేవ్’ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడుతో పాటు సంబంధిత శాఖ మంత్రులు హాజరుకానున్నారు. ఈ కాన్‌క్లేవ్‌లో ఎంఎస్‌ఎంఈ రంగాన్ని పర్యావరణహితంగా, ఆర్థికంగా బలోపేతం చేయడానికి చర్యలపై చర్చించనున్నారు.

అలాగే ఇంధన, నీటి వినియోగ సామర్థ్య కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా భారీ పెట్టుబడులు ఆకర్షించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 కింద మొదటి ప్రాజెక్టు ప్రారంభం కానుండటంపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ, రాబోయే కాలంలో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Banavasi Brucellosis|కర్నూలు జిల్లాలో ప్రమాదకర ‘బ్రూసెల్లోసిస్’ కలకలం.. పశువుల నుంచి మనుషులకు పాకిన జబ్బు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *