ఆంధ్రప్రదేశ్​Bhogapuram Airport | భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?

Bhogapuram Airport | భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

అక్షరటుడే, అనకాపల్లి: Bhogapuram Airport | ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లి పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ, ప్రతిష్టాత్మక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జులై మొదటి వారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) చేతుల మీదుగా ప్రారంభిస్తామని వెల్లడించారు.

ఉత్తరాంధ్రను పారిశ్రామికంగా, మౌలిక సదుపాయాల పరంగా అగ్రగామిగా నిలబెడతామని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రధాన ప్రకటనలు ఇవే:

ప్రాజెక్టులు గడువులోపే పూర్తి: ఉత్తరాంధ్ర పరిధిలోని పోర్టులు, ఎయిర్‌పోర్టులు, జాతీయ రహదారులు , సాగునీటి ప్రాజెక్టులను నిర్దేశించుకున్న గడువులోపే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

Bhogapuram Airport | తాగునీటి కష్టాలు:

ఈ జూన్ నెలలో వర్షాలు కురవగానే ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి’ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లి (Anakapalli) ప్రాంతానికి తరలిస్తామని చెప్పారు. దీనివల్ల స్థానిక సాగు, తాగునీటి కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు.

ఉపాధి అవకాశాలు: ప్రాంతానికి భారీగా పరిశ్రమలు వస్తున్నాయని, దీనివల్ల స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

ఇది కూడా చదవండి..: YSRCP Criticism | వైసీపీ శవరాజకీయాలు చేస్తుంది.. జగన్ నిర్ణయాల వల్ల బీసీలు, దళితులు నష్టపోతున్నారంటూ మంత్రి విమ‌ర్శ‌లు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....