Supreme Court | జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చినా ఓకే.. కానీ వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వద్దు: సుప్రీం జడ్జి

Srinivas Kolluri

అక్షరటుడే, న్యూఢిల్లీ: Supreme Court | సుప్రీంకోర్టులో శబరిమల పిటిషన్లపై విచారణ సందర్భంగా ఆసక్తికర చర్చ జరిగింది. విచారణలో భాగంగా సీనియర్ లాయర్ నీరజ్ కౌల్ వాదనలు వినిపిస్తూ.. “జ్ఞానం, వివేకం అనేవి ఏ మూలం నుంచి వచ్చినా, ఏ దేశం లేదా ఏ విశ్వవిద్యాలయం నుంచి వచ్చినా మనం వాటిని స్వాగతించాలి” అని పేర్కొన్నారు.

జస్టిస్ స్పందిస్తూ.. “అవును.. కానీ వాట్సాప్ యూనివర్సిటీ నుంచి మాత్రం కాదు” అని చమత్కరించారు. జస్టిస్ నాగరత్న చేసిన ఈ కౌంటర్‌తో కోర్టులో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లో తప్పుడు సమాచారం ప్రచారమవుతున్న తీరును ఉద్దేశించి ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Supreme Court | ఎనిమిదో రోజు విచారణ..

శబరిమల ఆలయ (Sabarimala Temple) సంప్రదాయాలు, మహిళల ప్రవేశం, మతపరమైన హక్కులకు సంబంధించిన ఈ కీలక పిటిషన్‌పై సుప్రీంకోర్టులోని 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఎనిమిదో రోజు విచారణను కొనసాగిస్తోంది. మత విశ్వాసాలకు, రాజ్యాంగ హక్కులకు మధ్య ఉన్న సమతుల్యతపై ఈ ధర్మాసనం లోతుగా చర్చిస్తోంది.

ఇది కూడా చదవండి..: Monalisa Case | విచారణకు రాలేనన్న మోనాలిసా.. కారణం ప్రెగ్నెన్సీయేనా?

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *