Monalisa Case | విచారణకు రాలేనన్న మోనాలిసా.. కారణం ప్రెగ్నెన్సీయేనా?

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Monalisa Case | కుంభమేళాలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియా (Social Media)లో ఫేమస్ అయిన మోనాలిసా, తన తల్లిదండ్రులను కాదని కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్‌ను ప్రేమించి ఈ సంవత్సరం మార్చి 11న వివాహం చేసుకుంది.

అయితే, ఆమె వయసుపై వివాదం తలెత్తడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆసుపత్రి రికార్డుల ప్రకారం వివాహం నాటికి మోనాలిసా వయసు కేవలం 16 ఏళ్ల 2 నెలల 12 రోజులు మాత్రమేనని తేలడంతో, మైనర్‌ను పెళ్లాడినందుకు ఫర్మాన్‌పై పోక్సో కేసు (POCSO Case) నమోదైంది.

Monalisa Case | తాజా పరిణామం:

ఈ కేసు విచారణలో భాగంగా మధ్యప్రదేశ్ పోలీసులు (Madhya Pradesh Police) మోనాలిసాను వ్యక్తిగతంగా హాజరుకావాలని కోరారు. ప్రస్తుతం ఆమె కేరళలో ఉండగా, ఆమె ఆరోగ్య పరిస్థితి రీత్యా ప్రయాణం చేయలేదని ఫర్మాన్ పోలీసులకు తెలియజేశారు. మోనాలిసా గర్భవతి కావడంతో విచారణకు హాజరుకాలేదని ఆయన పేర్కొన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Monalisa Case | కేసును మరింత క్లిష్టతరం చేసే అవకాశం:

అయితే, మోనాలిసా నిజంగానే తల్లి కాబోతుందా? లేక ఈ కేసు తీవ్రత నుంచి, అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఫర్మాన్ ఏదైనా ప్లాన్ చేశాడా? అనే సందేహాలు నెటిజన్లలో వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఆమె గర్భవతి అన్నది నిజమే అయితే, అది ఫర్మాన్‌పై నమోదైన పోక్సో కేసును మరింత క్లిష్టతరం చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు ఈ విషయాన్ని ఎలా నిర్ధారిస్తారు? తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

ఇది కూడా చదవండి..: Kashmir Tour Package | భూలోక స్వర్గాన్ని చూసొద్దామా..

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *