అక్షరటుడే వెబ్‌డెస్క్: TMC internal conflict | పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు పతాక స్థాయికి చేరాయి. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీపై ( Mamata Banerjee ) సొంత నేతలే తిరుగుబాటు జెండా ఎగురవేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో, తనపై తిరుగుబాటు చేసిన కీలక నేతలపై మమతా బెనర్జీ కఠిన చర్యలు తీసుకున్నారు.
TMC internal conflict | కొత్త జాతీయ కమిటీ..
పార్టీలో మమత ప్రాభవం తగ్గించేందుకు రెబల్ నేతలు పావులు కదిపారు. ప్రతిపక్ష నేత రితబ్రత బెనర్జీ సారథ్యంలో సమావేశమైన తిరుగుబాటు వర్గం, మమతా బెనర్జీని పార్టీ అధ్యక్షురాలి పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆమె స్థానంలో అరూప్ రాయ్‌ను కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకోవడమే కాకుండా, ఫిర్హాద్ హకీమ్, అరూప్ బిశ్వాస్‌లను ఉపాధ్యక్షులుగా నియమిస్తూ 30 మందితో కొత్త జాతీయ కమిటీని ప్రకటించింది. ఇకపై మమతా బెనర్జీని కేవలం పార్టీ ‘మెంటార్’ (మార్గదర్శి)గా మాత్రమే చూడాలని వారు షరతు విధించారు. తమకు 80 మంది ఎమ్మెల్యేల్లో 60 మంది మద్దతు ఉందని రెబల్స్ స్పష్టం చేశారు.
TMC internal conflict | మమత కౌంటర్ అటాక్..
తనకు అత్యంత సన్నిహితులుగా ఉన్నవారే వెన్నుపోటు పొడవడంతో మమతా బెనర్జీ వెంటనే రంగంలోకి దిగారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఫిర్హాద్ హకీమ్, అరూప్ బిశ్వాస్, జావేద్ అహ్మద్ ఖాన్, అరూప్ రాయ్, రథిన్ ఘోష్, బిప్లబ్ మిత్ర, సబీనా యాస్మిన్ , స్నేహాశిష్ చక్రవర్తిలను పార్టీ నుంచి బహిష్కరించారు.
TMC internal conflict | చీలిక దిశగా పార్టీ?
ఈ అంతర్గత పోరు కేవలం రాష్ట్ర స్థాయికే పరిమితం కాలేదు. ఇప్పటికే టీఎంసీకి చెందిన 28 మంది ఎంపీల్లో 20 మంది పార్టీని వీడి ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’లో విలీనం కావడం పార్టీలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 1998లో పార్టీని స్థాపించిన మమతా బెనర్జీకి, సొంత ముఖ్యనేతలే ఎదురు తిరగడంతో టీఎంసీ ఇప్పుడు చీలిక దిశగా పయనిస్తోందనే చర్చ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.
ఇది కూడా చదవండి: ACB Raids | ఎక్సైజ్ సూపరింటెండెంట్ అవినీతి.. ఆస్తులు చూసి షాకైన ఏసీబీ