అక్షరటుడే వెబ్‌డెస్క్: Ram Mandir Trust | రామమందిర విరాళాల చోరీ ఘటన నేపథ్యంలో ట్రస్ట్ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ భేటీలో ప్రధానంగా ట్రస్ట్ ముఖ్య నేతలు అనిల్ మిశ్రా రాజీనామా, కొత్త పరిపాలనా వ్యవస్థ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించనున్నారు. సోమవారం ( జులై 6 ) నిర్వహించనున్న ఈ కీలక సమావేశంలో ఆలయ ప్రధాన అధికారులు, అర్చకులు పాల్గొంటారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్, ప్రయాణానికి వీలులేని స్థితిలో ఉన్న సీనియర్ ట్రస్టీ పరాశరన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకానున్నారు. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సమక్షంలో ఈ చర్చలు జరగనున్నాయి.
Ram Mandir Trust | ప్రధాన అజెండా..
ట్రస్టీ అనిల్ మిశ్రా సమర్పించిన రాజీనామాను ఆమోదించాలా వద్దా అనే దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ రాజీనామా ఆమోదం పొందితే, ఆ స్థానంలో ఎవరిని నియమించాలి? భవిష్యత్తులో విరాళాల సేకరణ, ఆలయ నిర్వహణలో లోపాలు జరగకుండా ఎటువంటి పటిష్టమైన పాలనను తీసుకురావాలి? అనే విషయాలపై ట్రస్ట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
Ram Mandir Trust | సమగ్ర విచారణ జరపాలని..
రామమందిర విరాళాల వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వంటి ప్రతిపక్ష నేతలు పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వీటిని తేలికగా తీసుకోకూడదని విశ్వ హిందూ పరిషత్ (VHP) భావిస్తోంది. ఈ ఆరోపణల్లో నిజానిజాలు తేల్చాలని, ఆ నాయకుల వద్ద ఉన్న ఆధారాలు, డాక్యుమెంట్లను సేకరించి సమగ్ర విచారణ జరపాలని అయోధ్య పోలీసులకు వీహెచ్‌పీ లేఖ రాసింది. దోషులు ఎవరైనా వదిలిపెట్టవద్దని పోలీసులను కోరింది.
ఇది కూడా చదవండి: Kishan Reddy HYDRA | పేదలకు బుల్డోజర్లు.. ఎంఐఎంకు రక్షణ: రేవంత్ సర్కార్‌పై కిషన్ రెడ్డి ఫైర్