Bengaluru Mobile Theft | వింత ఘటన.. మొబైల్ చోరీ చేసి పారిపోతుండగా గుండెపోటు

బెంగళూరులో మొబైల్ చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Bengaluru Mobile Theft | బెంగళూరులో మొబైల్ చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. దొంగతనం చేసి పారిపోతుండగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో, వారిలో ఒకరు గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందగా, మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Bengaluru Mobile Theft | ఏం జరిగిందంటే..

కర్ణాటక రాజధాని బెంగళూరులోని కబ్బన్‌పేట్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు దొంగలు బైక్‌పై వచ్చి, దారిలో వెళ్తున్న ఒక వ్యక్తిని అడ్డుకుని అతని వద్ద ఉన్న మొబైల్‌ను లాక్కున్నారు. అనంతరం అక్కడి నుంచి వేగంగా పారిపోయేందుకు ప్రయత్నించారు. బాధితుడు వారిని వెంబడించాడు. దీనిని గమనించిన మరో వ్యక్తి దొంగలపై సంచిని విసిరేశాడు. ఈ ఒక్క దెబ్బతో బైక్ అదుపు తప్పి దొంగలు కింద పడిపోయారు.

theef.1

Bengaluru Mobile Theft | కుప్పకూలాడు

ప్రమాదం జరిగిన వెంటనే ఆ దొంగలు తేరుకుని పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే, ఆ సమయంలో వారిలో జునేద్ అనే దొంగకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. జునేద్‌తో పాటు ఉన్న మరొక దొంగ అర్బాజ్ పారిపోయేందుకు ప్రయత్నించగా, అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై అతడిని పట్టుకున్నారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.


ఇది కూడా చదవండి:  KBR Park Traffic Restrictions | నగరవాసులకు అలర్ట్​.. రేపు కేబీఆర్​ పార్క్​ పరిసరాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *