అక్షరటుడే, వెబ్డెస్క్: RTA Bus Seizure | ఆర్టీఏ అధికారుల తీరుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ (Hyderabad) నగరంలో చోటు చేసుకుంది.
ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులు (Khairatabad RTA Officers) ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు. హైదరాబాద్ నుండి రాజస్థాన్ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును శుక్రవారం రాత్రి తనిఖీ చేశారు. నిబంధనలు, అనుమతులు సక్రమంగా లేకపోవడంతో దానిని సీజ్చేశారు. అందులో ఉన్న ప్రయాణికులతో సహా బస్సును ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి తరలించారు.
RTA Bus Seizure | ఉదయం వరకు..

బస్సును సీజ్ చేసిన అధికారులు ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. దీంతో 50 మంది ప్రయాణికులు ఉదయం వరకు కార్యాలయంలోనే నిరీక్షించారు. దాదాపు 10 గంటలుగా తిండి, వాష్‌రూమ్స్ లేక ప్రయాణికులు బస్సులోనే తీవ్ర అవస్థలు పడ్డారు. బస్సును సీజ్ చేసిన అధికారులు తమను మరో బస్సులో పంపించాలని ప్రయాణికులు కోరారు. అయినా వారి గురించి ఎవరు పట్టించుకోలేదు. దీంతో అధికారుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో వాగ్వాదం చేశారు.
RTA అధికారుల నిర్వాకం.. 10 గంటలుగా ప్రయాణికుల అవస్థలు
HYD: ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారుల నిర్వాకానికి ప్రయాణికులు బలైపోయారు. నిన్న రాత్రి హైదరాబాద్ నుండి రాజస్థాన్ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును అధికారులు సీజ్ చేశారు. అయితే, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా 50 మంది… pic.twitter.com/ezfH2CoY91
— ChotaNews App (@ChotaNewsApp) June 20, 2026
ఇది కూడా చదవండి..: KBR Park Traffic Restrictions | నగరవాసులకు అలర్ట్.. రేపు కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు