అక్షరటుడే, వెబ్‌డెస్క్: KBR Park Traffic Restrictions | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు (Traffic police) తెలిపారు. H-CITI ప్రాజెక్టు పనులతో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయన్నారు.
పార్క్ పరిసరాల్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వన్‌వే ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ప్రధాన రోడ్లలో ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు చేశారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్ నెం.36, రోడ్ నెం.45 వైపు వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ నుంచి మాదాపూర్ వెళ్లే వాహనాలకు సైతం దారి మళ్లింపులు అమలు చేయనున్నారు.
KBR Park Traffic Restrictions | ఇలా వెళ్లాలి

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లేవారు.. రోడ్ నెం. 60, 67 మీదుగా వెళ్లాయి. ట్రయల్ రన్ సమయంలో ఎక్కడా U-టర్న్‌లకు ఛాన్స్‌లేదు. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (H-CITI) ప్రాజెక్టు కింద బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో చేపడుతున్న స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనుల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఈ పనులు చేపడుతున్నారు. ఎన్‌ఎఫ్‌సీఎల్ వైపు నుంచి వచ్చే వాహనదారులు ఎన్టీఆర్ భవన్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్ మీదుగా తమ వెళ్లాలి. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.
ఇది కూడా చదవండి..: IIRF Rankings 2026 | ఐఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్.. టాప్ 5లో హైదరాబాద్ యూనివర్సిటీ