Hyderabad Police | గుట్కా తయారీ కేంద్రంపై దాడి

హైదరాబాద్​ నగరంలో అక్రమంగా గుట్కా తయారు చేస్తున్న యూనిట్​పై పోలీసులు దాడి చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Police | హైదరాబాద్​ నగరంలో అక్రమంగా గుట్కా తయారు చేస్తున్న యూనిట్​పై పోలీసులు దాడి చేశారు. ముగ్గురు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు.

ఆసిఫ్ నగర్‌ (Asif nagar)లోని మురాద్​నగర్‌లో గుట్కా తయారీ చేస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు శుక్రవారం దాడులు చేశారు. రూ.50 లక్షల విలువైన స్టాక్, ముడిపదార్థాలు, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ పని చేస్తున్న ముగ్గురు కార్మికులను అరెస్ట్ చేశారు. ఇద్దరు చిన్నారులను కూడా నిర్వాహకులు పనిలో పెట్టుకున్నట్లు గుర్తించారు. వారిని రక్షించారు. ఇద్దరు నిర్వాహకులు పరారీలో ఉన్నారని పోలీసులు 260 కిలోల గుట్కా, పొగాకు ఉత్పత్తులు, తయారీ ప్యాకింగ్ కోసం ఉపయోగించే యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad Police | మద్యం స్వాధీనం

గాంధీ జయంతి (Gandhi Jayanthi) రోజున మద్యం విక్రయించిన వ్యక్తిని గోషామహల్​ పోలీసులు అరెస్ట్ చేశారు. సరైన లైసెన్స్ లేకుండా మద్యం విక్రయిస్తున్నందుకు బేగం బజార్‌కు చెందిన అర్జున్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. 20 బాటిళ్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. సెలవు కారణంగా వైన్ షాపులు మూసివేయడంతో, సింగ్ తక్కువ ధరలకు మద్యం కొనుగోలు చేసి అధిక ధరకు తిరిగి విక్రయించినట్లు గుర్తించారు.

దీనిని కూడా చదవండి : Son in Law Shraddha | అత్తమామలకు అల్లుడు శ్రాద్ధం పెట్టవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోందంటే..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *