Nizamabad Daylight Theft | నగరంలో దొంగల బీభత్సం.. పట్టపగలే భారీ చోరీ..

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad Daylight Theft | నగరంలో(Nizamabad) దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టపగలే ఓ ఇంట్లోకి దూరి భారీ ఎత్తున సొత్తు దోచుకున్నారు.

Nizamabad Daylight Theft | వినాయక్​ నగర్​లోని ..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని 4వ టౌన్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని వినాయక్​నగర్​ దత్తాత్రేయ ఆలయ సమీపంలోని ఓ ఇంట్లో వ్యక్తులు శుక్రవారం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. దీనిని గమనించిన దొంగలు పట్టపగలే చోరీకి పాల్పడ్డారు. తిరిగి వచ్చిన కుటుంబీకులు ఇంటి తాళం పగలగొట్టబడి ఉండడాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. హుటాహుటిన ఎస్​హెచ్​వో సతీష్​, సిబ్బంది రమేష్​, సుభాష్​, పోచయ్య, సందీప్​లు ఘటనాస్థలానికి చేరుకుని సమాచారం సేకరించారు. ఈ ఘటనలో 8 తులాల బంగారు నగలు, 40 తులాలకు పైగా వెండి, రూ.పదివేలు చోరీకి గురయినట్లు బాధితులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: బాలీవుడ్​ నటికి ప్రమాదం.. వెన్నెముకకు ఫ్రాక్చర్! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *