Women’s Hockey | మహిళల హాకీలో భారత్‌కు గోల్డ్‌ మెడల్‌

ఆసియా గేమ్స్​లో భారత మహిళల జట్టు గోల్డ్​ మెడల్​ సాధించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Women’s Hockey | ఆసియా గేమ్స్​ (Asian Games)లో భారత్​ సంచలనం సృష్టించింది. మహిళల హాకీ టీమ్​ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ గోల్డ్​ మెడల్ సాధించింది.

ఆసియా గేమ్స్​ మహిళల హాకీ ఫైనల్​లో భారత జట్టు శుక్రవారం చైనా (China)తో తలపడింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్​లో భారత్​ 1–0 తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ చైనాను ఓడించి స్వర్ణం గెలిచింది. 44 ఏళ్ల తర్వాత మహిళల హాకీలో భారత్‌కు స్వర్ణం లభించడం గమనార్హం. ఈ విజయంతో భారత మహిళల జట్టు 2028 ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 1982 తర్వాత తొలిసారిగా, ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

Women’s Hockey | ఉత్కంఠ పోరు..

మ్యాచ్‌లోని మొదటి క్వార్టర్‌లో 10వ నిమిషంలో భారత క్రీడాకారిణి లాల్‌రెమ్‌సియామి హ్మార్జోటే గోల్‌ను సాధించింది. ఆ తర్వాత ఇరు జట్లు తీవ్రంగా పోరాడిన గోల్స్​ చేయలేకపోయాయి. రెండో క్వార్టర్​లో చైనాకు పెనాల్టీ స్ట్రోక్ లభించింది. అయితే భారత గోల్‌కీపర్ సవితా పునియా దానిని అడ్డుకుంది. చివరి క్వార్టర్​లలో భారత్​ తన ఆధిక్యాన్ని కాపాడుకోవడానికి సేఫ్​ గేమ్ ఆడింది. దీంతో చైనా గోల్​ చేయలేకపోయింది. భారత్ 1–0 తేడాతో గెలిచింది.

దీనిని కూడా చదవండి : Asian Games | రెజ్లింగ్​లో పసిడి పట్టు.. బాక్సింగ్​లో మూడు స్వర్ణాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.