అక్షరటుడే, వెబ్‌డెస్క్: Asian Games | ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు శుక్రవారం అదరగొట్టారు. ఏకంగా నాలుగు స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. దీంతో భారత్ (India) పతకాల పట్టికలో టాప్ 5లోకి దూసుకెళ్లింది.
భారత్ బాక్సర్ లవ్లీనా ఉదయం పసిడితో శుభారంభం అందించగా.. మరో ఇద్దరు బాక్సర్లు పసిడి గెలుచుకున్నారు. రెజ్లర్ సుజిత్ సైతం ఫైనల్‌లో అద్భుత ప్రదర్శనతో గెలిచి పసిడి పతకం సాధించాడు. ఫైనల్‌లో సుజిత్ తజకిస్తాన్ ఆటగాడితో తలపడ్డాడు. ఫస్ట్ హాఫ్‌లో అతడు 9–2 తో వెనుకబడి ఉన్నాడు. రెండో రౌండ్లో అద్భుతంగా రాణించాడు. ప్రత్యర్థి ఒక్క పాయింట్ సాధించే అవకాశం ఇవ్వలేదు. చిరవకు 10–9తో ఘన విజయం సాధించి పసిడి పతకం గెలుచుకున్నాడు.
Asian Games | బాక్సర్ల హవా..
లవ్లీనా బంగారు పతకానికి తోడు మరో ఇద్దరు బాక్సర్లు పసిడి గెలుచుకొని హ్యాట్రిక్ సాధించారు. బాక్సింగ్‌లో పర్వీన్ హూడా (65 కేజీల విభాగం), పసిడి నెగ్గింది. ఇద్దరు మహిళ బాక్సర్లు స్వర్ణ పతకాలు గెలవడం ఆసియా క్రీడల్లో ఇదే తొలిసారి కావడం గమనార్హం. పురుషుల బాక్సింగ్‌లో అంకుష్ పంఘల్ గోల్డ్ మెడల్ గెలిచాడు. 80 కేజీల ఫైనల్‌లో ఈ భారత బాక్సర్, దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మిన్‌సియోంగ్‌ను 4-0 తేడాతో ఓడించాడు. ఈ రోజు ఆర్చరీలో రికర్వ్ మిక్స్‌డ్ టీమ్, పురుషుల రికర్వ్ టీమ్ రజత పతకాలు గెలుచుకున్నాయి. పురుషుల సెపక్‌టక్రా టీమ్ కాంస్యం సాధించింది. ప్రస్తుతం భారత్ 15 బంగారు, 25 రజత, 35 కాంస్య పతకాలతో ఐదో స్థానంలో ఉంది.
ఇది కూడా చదవండి..: Lovlina Borgohain | లవ్లీనా పసిడి పంచ్.. బాక్సింగ్‌లో ఘన విజయం