అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Asian Games Hockey | ఆసియా గేమ్స్‌లో భాగంగా శనివారం జరిగిన హాకీ (Asian Games Hockey) మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆసియా గేమ్స్ 2026లో తన ప్రస్థానాన్ని ముగించింది.
పురుషుల హాకీ ఫైనల్‌లో భారత్ 5-1 తేడాతో మలేషియాను త్తుగా ఓడించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ సాధించారు. ప్రారంభంలో మలేషియా స్కోరును సమం చేసినప్పటికీ, రెండో క్వార్టర్‌లో భారత్ ఆధిక్యం సాధించింది. అనంతరం దానికి 5–1 పెంచుకుంది. దీంతో ఘన విజయం సాధించింది. ఆసియా క్రీడల ఒకే ఎడిషన్‌లో పురుషుల, మహిళల హాకీ విభాగాల్లో భారత్ స్వర్ణ పతకాలు గెలుచుకోవడం ఇదే మొదటిసారి. దీంతో పాటు క్రికెట్, కబడ్డీ మహిళలు, పురుషుల జట్లు సైతం ఈసారి పసిడి పతకాలు సాధించాయి.
Asian Games Hockey | 21వ స్వర్ణాలు
హాకీలో స్వర్ణంతో భారత్ మొత్తం 85 పతకాలను తన ఖాతాలో వేసుకుంది. ఇందులో 21 స్వర్ణం, 27 రజతం, 37 కాంస్య పతకాలు ఉన్నాయి. మొత్తంగా నాలుగో స్థానంలో నిలిచింది. 341 పతకాలతో చైనా టాప్‌లో ఉండగా, 269 పతకాలతో జపాన్ రెండు, రిపబ్లిక్ ఆఫ్ కొరియా 150 పతకాలతో మూడో స్థానంలో నిలిచాయి. కాగా గత ఆసియా క్రీడల్లో భారత్ 106 పతకాలు గెలవగా ఈ సారి 85కు తగ్గాయి. అంతకుముందు పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో రెజ్లర్ అమన్ సెహ్రావత్ స్వర్ణం గెలుచుకున్నాడు.
चक दे इंडिया!
Heartiest congratulations to the Indian Men’s Hockey Team on winning the Gold Medal at the #AsianGames2026 & successfully defending their title!
With this triumph, India also secures direct qualification for the LA 2028 Olympics.A magnificent achievement for… pic.twitter.com/rsrJ3QMe0w
— Kiren Rijiju (@KirenRijiju) October 3, 2026
దీనిని కూడా చదవండి : Hanuman Ansh Telugu Release | హనుమాన్ అంశ్ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే