అక్షరటుడే, వెబ్డెస్క్: Vikas Marmat Transfer | బెంగళూరు (Bangalore) పబ్ వివాదం తర్వాత ఏపీ ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ను ప్రభుత్వం బదిలీ చేసింది. కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (KADA) ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆయన ఇటీవల బెంగళూరు పబ్లో పోలీసులతో గొడవ పడ్డారు.
నగరంలోని రెసిడెన్సీ రోడ్డులోని ఒక పబ్లో అర్ధరాత్రి తనిఖీల సమయంలో ఐఏఎస్ అధికారి, మరో ముగ్గురు పోలీసులతో వాగ్వాదం చేశారు. దీంతో వారు కేసు నమోదు చేశారు. దీంతో ప్రభుత్వం ఆయనను ట్రాన్స్ఫర్ చేసింది. 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన మర్మత్ను తక్షణమే బదిలీ చేసి, తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. కాడా ఇన్చార్జ్ బాధ్యతల కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ను ఆదేశించింది.
Vikas Marmat Transfer | గుర్తింపు కార్డు అడిగితే..
బెంగళూరు పోలీసులు అక్టోబర్ 10 అర్ధరాత్రి 1.30 గంటలకు బార్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేశారు. వినియోగదారుల వయసు నిర్ధారించుకోవడానికి గుర్తింపు కార్డులు చూపించాలని అడిగారు. దీంతో ఐఏఎస్ అధికారి వికాస్, ఆయన మిత్రులు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఇన్స్పెక్టర్ అరుణ్ సలుంకే ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేశారు. మర్మత్, అతని సహచరులు విధుల్లో ఉన్న అధికారులతో వాగ్వాదానికి దిగి, వారిని దూషించి, పోలీసు సిబ్బందిపై దాడి చేశారని, బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Meerut Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసులో సంచలన తీర్పు.. భార్య, ప్రియుడికి ఉరిశిక్ష