అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Punjab CM OSD | పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann) ఓఎస్డీపై సీబీఐ (CBI) కేసు నమోదు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఓఎస్‌డీతో పాటు మరో ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, 8 చోట్ల సోదాలు నిర్వహించింది.
హైకోర్టు ఆదేశాల మేరకు ఈడీ నుంచి నివేదిక అందిన నేపథ్యంలో, పంజాబ్ ముఖ్యమంత్రి ఓఎస్‌డీ, అతని సహచరులపై అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి సీబీఐ కేసు నమోదు చేసింది. నిందితులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సహా అధికారుల పోస్టింగ్‌ల కోసం డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేగాకుండా పరిపాలనా ఆమోదాలు, టెండర్ షరతులు, లైసెన్సింగ్ విషయాలు, ఆస్తి వివాదాలు, భూమికి సంబంధించిన సమస్యలను డబ్బుల కోసం తారుమారు చేసినట్లు సమాచారం.
Punjab CM OSD | కీలక పత్రాలు స్వాధీనం
సీబీఐ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, మధ్యవర్తులు, సహచరులతో సహా ఆరుగురిపై కేసు నమోదు చేసింది. వారిలో పంజాబ్ ముఖ్యమంత్రికి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ) అయిన రాజ్‌బీర్ ఘుమన్, నితిన్ గోహల్, జితిన్ గోహల్ అలియాస్ రాజా, రోమీ రాజా మహాజన్, బీర్ దేవిందర్, ఆర్.ఎస్. నాగ్రా ఉన్నారు. నిందితులకు సంబంధించిన నివాసాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
దీనిని కూడా చదవండి : ORR Tipper Accident | రింగ్‌రోడ్డుపై ఘోర ప్రమాదం.. టిప్పర్ డ్రైవర్ మృతి