అక్షరటుడే, వెబ్డెస్క్: India Condemns Ship Attacks | పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరగడాన్ని ‘తీవ్ర ఆందోళనకరం’గా అభివర్ణిస్తూ, హర్ముజ్ జలసంధిలో పలు సముద్ర నౌకలపై ఇటీవల జరిగిన దాడులను భారతదేశం తీవ్రంగా ఖండించింది. ఆ ప్రాంతంలోని అంతర్జాతీయ జలమార్గాల ద్వారా నిరాటంకమైన నౌకాయానం, వాణిజ్యాన్ని పునరుద్ధరించాలని సూచించింది.
పశ్చిమ ఆసియా భారత్కు అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రాంతమని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పార్వతనేని హరీష్ అన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాలని సూచించారు. హర్ముజ్ జలసంధి (Strait of Hormuz) మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు జీఎఫ్ఎస్ గెలాక్సీ, ఎంటీ అల్ బహియా, ఎంటీ మొంబాసాలతో సహా పలు నౌకలపై జరిగిన దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు హరీష్ తెలిపారు.
India Condemns Ship Attacks | భారతీయులకు గాయాలు
హర్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులు జరగడంతో ఒక భారతీయుడు మృతి చెందాడు. పలువురు భారత నావికులు గాయపడ్డారు. సముద్రయాన సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని జరిగే హింసాత్మక చర్యలను, హర్ముజ్ జలసంధి వంటి అంతర్జాతీయ జలమార్గాల ద్వారా స్వేచ్ఛాయుత, సురక్షితమైన నౌకాయానానికి అంతరాయం కలిగించడాన్ని భారతదేశం నిరంతరం ఖండిస్తూనే ఉందని హరీష్ తెలిపారు. వాణిజ్య నౌకలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు.
ఇది కూడా చదవండి..: JP Nadda CPM Leaders | సీపీఎం నేతలపై జేపీ నడ్డా ఆగ్రహం