అక్షరటుడే, వెబ్డెస్క్: Pooja Precision IPO | పూజా ప్రెసిషన్ ఇంజనీరింగ్ కంపెనీ 1992లో కంపెనీ ప్రారంభమైంది. ఇది ఇంజిన్స్, డ్రైవ్ ట్రెయిన్స్, ఈవీ పవర్ ట్రెయిన్స్, ఎలక్ట్రికల్ సిస్టమ్స్ లో వినియోగించే అల్ల్యూమినియం డైకాస్టింగ్, ప్రెసిషన్ మెషిన్డ్ పార్ట్స్ తయారు చేస్తుంది.
ఈ కంపెనీ ఐపీఓ (IPO) ద్వారా మొత్తం రూ. 159.83 కోట్లు సమీకరించాలని భావిస్తుంది. ఈ ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ మేకర్ కి రూ. 10 ఫేస్ వ్యాల్యూ కలిగిన 2,66,000 షేర్లను విక్రయించి రూ. 8 కోట్లు, పబ్లిక్ కు 50,44,000 షేర్లను విక్రయించి రూ. 152 కోట్లని పొందాలని యోచిస్తోంది. ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంస్థ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కార్పొరేట్ అవసరాలు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
Pooja Precision IPO | ముఖ్యమైన తేదీలు..
ఐపీవో సబ్స్క్రిప్షన్ జూలై 28న ప్రారంభమైంది. 30వ తేదీతో బిడ్డింగ్ గడువు ముగుస్తుంది. కంపెనీ షేర్ల అలాట్మెంట్ స్టేటస్ 31న రాత్రి వెల్లడవుతుంది. కంపెనీ షేర్లు ఆగస్టు 4న బీఎస్ఈలో లిస్టవుతాయి.
Pooja Precision IPO | ప్రైస్ బ్యాండ్..
కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 285 నుంచి రూ. 301 గా నిర్ణయించింది. ఒక లాట్లో 400 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం రెండు లాట్ల కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 2,40,800 తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Pooja Precision IPO | కోటా, జీఎంపీ..
క్యూఐబీలకు 47.08 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 32.98 శాతం, ఎన్ఐఐలకు 14.15 శాతం, మార్కెట్ మేకర్స్ కు మిగిలిన వాటా కేటాయించారు. ఈ కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. 90 శాతం ప్రీమియంతో ట్రేడ్ అవుతుండడంతో మంచి లిస్టింగ్ గెయిన్స్ వస్తాయని ఆశిస్తున్నారు. అయితే గ్రే మార్కెట్ ప్రీమియం ఆధారంగా కాకుండా కంపెనీ వాల్యూయేషన్స్ చూసి ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం.
ఇది కూడా చదవండి..: Balaji Mala IPO | లిస్టింగ్ సూపర్ హిట్.. వెంటనే లోయర్ సర్క్యూట్తో ఆనందం ఆవిరి