Infosys Market Cap | ఇన్ఫోసిస్ కు ఏమయ్యింది?.. టాప్ -10 జాబితానుంచి అవుట్

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Infosys Market Cap | కృత్రిమ మేధ (Artificial Intelligence) ప్రభావంతో ఐటీ, డేటా సర్వీసెస్ రంగంలో సంక్షోభం నెలకొంది. ప్రముఖ కృత్రిమ మేధ సంస్థ ‘యాంథ్రోపిక్’ తన ‘క్లాడ్’ మోడల్ ఆధారంగా రూపొందించిన కొత్త ఏఐ ఆటోమేషన్ టూల్స్ ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఈ ఏఐ టూల్ డేటా అనాలసిస్, డాక్యుమెంట్ రివ్యూ వంటి సంక్లిష్టమైన పనులను సైతం సమర్థవంతంగా చేయగలవని కంపెనీ పేర్కొంది.

ఈ కంపెనీ టూల్స్ సేవా రంగంపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. సాధారణంగా భారతీయ ఐటీ కంపెనీ (Indian IT Company)లకు విదేశీ క్లయింట్ల నుంచి అవుట్‌సోర్స్ అయ్యే పనుల్లో ఇవి కీలకమైనవి. ఈ నేపథ్యంలో యాంథ్రోపిక్ రూపొందించిన టూల్స్‌తో దేశీయ కంపెనీలు ఒత్తిడికి గురవుతున్నాయి. ఏఐ ద్వారానే ఆయా పనులు తక్కువ ఖర్చుతో పూర్తవుతాయనే నివేదికలతో ఐటీ కంపెనీల భవిష్యత్తు ఆదాయాలపై ఇన్వెస్టర్లలోనూ ఆందోళన నెలకొంది. దీంతో దాదాపు మÖడు నెలలుగా ఐటీ కంపెనీల షేర్ల ధరలు కుంగుబాటుకు లోనవుతూనే ఉన్నాయి.

Infosys Market Cap | ఇన్ఫోసిస్‌కు నష్టాలు..

ఏఐ భయాలతో ఇన్ఫోసిస్ తీవ్రంగా నష్టపోతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు ఇన్ఫోసిస్ షేరు ధర 29 శాతం పడిపోయింది. 2025 చివరి నాటికి ఇన్ఫోసిస్ మార్కెట్ మూలధనం రూ. 6.8 లక్షల కోట్లకుపైగా ఉండేది. దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ సేవల ఎగుమతి సంస్థ అయిన ఈ కంపెనీ నాలుగు నెలల కాలంలో రూ. 2 లక్షల కోట్లకుపైగా మార్కెట్ క్యాప్ ను కోల్పోయింది. ఏప్రిల్ 29 నాటికి కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 4.67 లక్షల కోట్లుగా ఉంది. దీని ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market)లో అత్యంత విలువైన తొలి 10 సంస్థల జాబితాలోంచీ బయటికి రావాల్సి వచ్చింది. ప్రస్తుతం భారతదేశంలోని అత్యంత విలువైన సంస్థల జాబితాలో కంపెనీ 11వ స్థానంలో ఉంది. కాగా ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన ఇన్ఫోసిస్ షేరు ధర రూ. 1,629 వద్ద ఉంది. అక్కడినుంచి 29 శాతం పతనమై ఏప్రిల్ 28 నాటికి రూ. 1,152 వద్ద స్థిరపడింది.

Infosys Market Cap | 10వ స్థానానికి ఎల్ఐసీ..

ఇన్ఫోసిస్ టాప్ టెన్ జాబితానుంచి అవుట్ కాగా.. ఎల్ఐసీ తొలిసారి ఆ జాబితాలో చోటు సంపాదించుకుంది. ఆ కంపెనీ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ. 5.19 లక్షల కోట్లుగా ఉంది. కాగా ఈ జాబితాలో రిలయన్స్ రూ. 19 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ తో అగ్రస్థానంలో ఉంది.

 Infosys Market Cap | టాప్ -10 కంపెనీల జాబితా..

రిలయన్స్ ఇండస్ట్రీస్ – రూ. 19.02 లక్షల కోట్లు
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ – రూ. 12.08 లక్షల కోట్లు
భారతి ఎయిర్టెల్ – రూ. 11.41 లక్షల కోట్లు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – రూ. 10.09 లక్షల కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ – రూ. 9.21 లక్షల కోట్లు
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ – రూ. 8.96 లక్షల కోట్లు
బజాజ్ ఫైనాన్స్ – రూ. 5.73 లక్షల కోట్లు
లార్సెన్ అండ్ టూబ్రో – రూ. 5.60 లక్షల కోట్లు
హిందుస్థాన్ యూనిలివర్ – రూ. 5.41 లక్షల కోట్లు
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా – రూ. 5.19 లక్షల కోట్లు

ఇది కూడా చదవండి..: Hyundai Ioniq 5 Facelift | హ్యుందాయ్ కొత్త అయానిక్ 5 ఫేస్‌లిఫ్ట్.. సింగిల్ చార్జింగ్ తో 690 కి.మీ. ప్రయాణం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *