Forest Officer Bike Burning | ఫారెస్ట్​ అధికారి బైక్​ దగ్ధం..

Balla Sandeep Kumar

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Forest Officer Bike Burning | నిజామాబాద్​ జిల్లాలో ఓ ఫారెస్ట్​ అధికారి బైక్​ దగ్ధమైంది. ఈ ఘటన సిరికొండ మండలం (Sirikonda Mandal) రావుట్ల ఫారెస్ట్​ రేంజ్​ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది.

Forest Officer Bike Burning | ఫుట్​ పెట్రోలింగ్​ చేస్తుండగా..

రావుట్ల రేంజ్​ ఆఫీసర్​ నర్సింగ్​రావు తెలిపిన వివరాల ప్రకారం.. రోజువారీ విధుల్లో భాగంగా రావుట్ల అటవీశాఖ రేంజ్​ (Ravutla Forest Range) పరిధిలో మంగళవారం బీట్​ ఆఫీసర్​ కె.శ్రీకాంత్​ ఆధ్వర్యంలో సిబ్బంది అడవిలో ఫుట్​ పెట్రోలింగ్​కు​ వెళ్లారు. ఈ క్రమంలో బైక్​ను కొద్దిదూరంలో నిలిపి ఉంచి అడవిలోకి తనిఖీల నిమిత్తం వెళ్లారు. కొన్ని గంటల అనంతరం తిరిగి వచ్చి చూడగా బైక్​ పూర్తిగా దగ్ధమై ఉంది. వెంటనే మంటలను ఆర్పివేసిన సిబ్బంది తమ ఉన్నతాధికారులకు, సిరికొండ పోలీసులకు సమాచారాన్ని అందించారు. స్పందించిన సిరికొండ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బీట్​ ఆఫీసర్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: BRSV Leaders Arrest | బీఆర్​ఎస్​వీ నాయకుల అక్రమ అరెస్ట్​లు సిగ్గుచేటు..

 

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *