నిజామాబాద్BRSV Leaders Arrest | బీఆర్​ఎస్​వీ నాయకుల అక్రమ అరెస్ట్​లు సిగ్గుచేటు..

BRSV Leaders Arrest | బీఆర్​ఎస్​వీ నాయకుల అక్రమ అరెస్ట్​లు సిగ్గుచేటు..

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పోరాడుతున్న తమను అక్రమంగా అరెస్ట్​ చేయడం సిగ్గుచేటని బీఆర్​ఎస్​వీ నాయకులు అన్నారు.

అక్షరటుడే, ఆర్మూర్: BRSV Leaders Arrest | పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) బకాయిలను వెంటనే విడుదల చేయాలని పోరాడుతున్న తమను అక్రమంగా అరెస్ట్​ చేయడం సిగ్గుచేటని బీఆర్​ఎస్​వీ నాయకులు పేర్కొన్నారు. పట్టణంలో బుధవారం ఆందోళన నిర్వహిస్తున్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆర్మూర్​ పోలీస్​స్టేషన్​ (Armoor Police Station)కు తరలించారు.

BRSV Leaders Arrest | అక్రమ అరెస్ట్​లతో ఉద్యమాన్ని ఆపలేరు..

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అక్రమ అరెస్ట్​లతో ఉద్యమాన్ని ఆపలేరని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పూర్తిగా విడుదల చేసే వరకు ఉద్యమం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం చేస్తున్న వారిపై దమనకాండ కొనసాగించడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. చేతకాని ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ, విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించి బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు అగ్గు క్రాంతి, బీఆర్‌ఎస్‌వీ జిల్లా నాయకులు మీరా శ్రావణ్, షాహిద్ అలీ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Congress Bhavan | రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్​ భవనాలు: టీపీసీసీ చీఫ్

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....

Modi UAE Visit | ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. యూఏఈలో కీలక భేటీ!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Modi UAE Visit | ఐరోపా దేశాల్లో వచ్చే నెల...

IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారుల బదిలీ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS)...