అక్షరటుడే, బాన్సువాడ: Banswada missing cases | కామారెడ్డి kamareddy జిల్లా బాన్సువాడ పట్టణంతో పాటు మండల పరిధిలో ఇద్దరు వ్యక్తులు, రెండేళ్ల చిన్నారి కనిపించకుండా పోయిన ఘటనలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాన్సువాడ పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Banswada missing cases | హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి…
సీఐ తుల శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మొదటి ఘటనలో, బాన్సువాడ పట్టణంలోని చైతన్య కాలనీలో గత 8 నెలలుగా నివాసముంటున్న మేస్త్రీ జొన్నలగడ్డ ఆదాం (32) ఈ నెల 24న ఉదయం 9 గంటల సమయంలో తన ద్విచక్రవాహనం (TG 07 AM 17395) పై ఇంటి నుంచి బయలుదేరాడు.
మధ్యాహ్నం 12 గంటలకు భార్య రేఖకు ఫోన్ చేసి పని నిమిత్తం హైదరాబాద్ వెళ్తున్నట్లు సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత అతని సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Banswada missing cases | ఆసుపత్రికి వెళ్తానని చెప్పి తల్లీకూతుళ్లు మాయం
రెండో ఘటనలో.. బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామానికి చెందిన రాజారాందుబ్బ నివాసి టేకు సుజాత (25) తన రెండేళ్ల కుమార్తెతో కలిసి ఈ నెల 24 ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి వెళ్లింది. తలనొప్పిగా ఉందని, ఆసుపత్రికి వెళ్లి వస్తానని చెప్పిన ఆమె తిరిగి రాలేదు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడం, సుజాత ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. రెండు వేర్వేరు ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసి, ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు సీఐ తెలిపారు.