అక్షరటుడే, వెబ్డెస్క్: Dichpally market committee chairman | మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవిని తమ మండలానికి కేటాయించాలని, అందులోనూ బంజారా వర్గానికి చెందిన సీనియర్ నాయకురాలు, మాజీ కార్పొరేటర్ చాంగుబాయికి అవకాశం ఇచ్చి మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించాలని రూరల్ శాసనసభ్యులు భూపతిరెడ్డికి బంజారా సర్పంచులు విజ్ఞప్తి చేశారు.
Dichpally market committee chairman | బంజారా సమాజ సంక్షేమానికి కృషి
నిజామాబాద్ Nizamabad జిల్లా డిచ్పల్లి మండలానికి చెందిన బంజారా సర్పంచులంతా మంగళవారం ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పార్టీ అభివృద్ధికి, బంజారా సమాజ సంక్షేమానికి చాంగుబాయి ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. ఆమెకు మార్కెట్ కమిటీ అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగిస్తే స్థానిక బంజారా వర్గానికి, మహిళా నేతలకు సరైన ప్రాతినిధ్యం లభించడంతో పాటు పార్టీ బలోపేతానికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
మండలానికి చెందిన బంజారా వర్గానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి, ఈ పదవిలో చాంగుబాయిని నియమించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు బంజారా ప్రజాప్రతినిధులు, నాయకులు, సర్పంచులు పాల్గొన్నారు.