Tree Dispute | వేప చెట్టు కోసం గొడవ.. ఇద్దరి మృతి

వేపచెట్టు కోసం జరిగిన గొడవలో ఇద్దరు మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tree Dispute | వేపచెట్టు విషయంలో తలెత్తిన వివాదం పెద్ద గొడవకు దారి తీసింది. ఇరువర్గాల వారు పరస్పరం దాడులు చేసుకోవంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా (Suryapet District) మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో చోటు చేసుకుంది.

తండాలో వేప చెట్టు విషయంలో ఇరువర్గాల మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం మరోసారి గొడవ జరిగింది. దీంతో మాట మాట పెరగడంతో గొడ్డళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో మంద వెంకటేశ్వర్లు (62) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అడ్డుకోబోయిన సైదా అనే వ్యక్తిపై సైతం పెదబాబు దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతడు కూడా చికిత్స పొందుతూ చనిపోయాడు.

Tree Dispute | ఎస్సైపై దాడి..

రెండు కుటుంబాలకు మధ్య కొంతకాలంగా పాతకక్షలు ఉన్నాయని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. పెదబాబు ఇద్దరిపై దాడి చేయడంతో స్థానికులు అతడిని గదిలో బందించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై నవీన్​ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకోవడానికి యత్నించగా.. పెదబాబు ఎస్సైపై సైతం దాడి చేశాడు. దీంతో ఆయన తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తండాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి..: Revanth Reddy Ticket | రేవంత్ చెప్పినంత మాత్రాన సీటు ఖరారైనట్టు కాదు!..పరకాల టికెట్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్.. కాంగ్రెస్‌లో మళ్లీ చర్చకు దారితీసిన అభ్యర్థిత్వ అంశం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *