అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana Heatwave | రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని వాతావారణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇటీవల కురిసిన అకాల వర్షాలతో వాతావరణం కాస్త చల్లబడింది. ఆకాశం మేఘావృతం అయి ఉంటుంది. అయితే వేడి మాత్రం అధికంగా ఉండటంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఏసీలు, కూలర్ల వినియోగం పెరిగింది. ఈ క్రమంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు ఎండలు మండుతాయని అధికారులు తెలిపారు.
Telangana Heatwave | ఆ జిల్లాలకు అలెర్ట్
ఉత్తర తెలంగాణ (Telangana)లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని అధికారులు పేర్కొన్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లా (Nizamabad District)ల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో 43 డిగ్రీలకు చేరుకునే ఛాన్స్ ఉంది.
Telangana Heatwave | 28 నుంచి వర్షాలు
హీట్‌వేవ్ అనంతరం ఈ నెల 28, 29 తేదీల నుంచి రాష్ట్రంలో మళ్లీ వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు. మే మొదటి వారం వరకు అకాల వర్షాలు కురుస్తాయి. ఆసిఫాబాద్ నుంచి సూర్యాపేట వరకు తూర్పు తెలంగాణ ప్రాంతం, అలాగే శ్రీకాకుళం నుంచి గుంటూరు బెల్టు వరకు ఉన్న ఉత్తర, మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలు భారీ వర్షాలు పడనున్నాయి.
ఇది కూడా చదవండి..: Kavitha Party Controversy | కవిత పార్టీపై బీఆర్ఎస్ సెటైర్లు

