తెలంగాణKavitha Party Controversy | కవిత పార్టీపై బీఆర్​ఎస్​ సెటైర్లు

Kavitha Party Controversy | కవిత పార్టీపై బీఆర్​ఎస్​ సెటైర్లు

కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై బీఆర్​ఎస్​ విమర్శలు చేసింది. ఒరిజినల్​ ఒరిజినలే అని ఎక్స్​లో పోస్ట్ చేసింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kavitha Party Controversy | కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర సేన (Telangana Rashtra Sena)గా తన పార్టీ పేరు పెట్టారు. గతంలో టీఆర్​ఎస్​ బీఆర్​ఎస్​గా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కవిత తన పార్టీ పేరు టీఆర్​ఎస్ వచ్చేలా పెట్టారు.

కవిత పార్టీ (Kavitha Party)పై బీఆర్​ఎస్​ సెటైర్లు వేసింది. ఒరిజినల్​ ఒరిజినలే అని ఎక్స్​లో పోస్ట్ చేసింది. కోల్గేట్, బిస్లేరి ఒరిజినల్​, నకిలీ ఫొటోలను షేర్​ చేస్తూ కవిత పార్టీ నకిలీదని అర్థం వచ్చేలా పోస్ట్ చేసింది. అంతేగాకుండా గతంలో వైఎస్​ షర్మిల ఏర్పాటు చేసిన వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ (Telangana Party)తో కవిత పార్టీని పోల్చింది. వైఎస్​ఆర్​సీపీకి బదులుగా షర్మిల వైఎస్​ఆర్​టీపీ పెట్టారని, తెలంగాణ రాష్ట్ర సమితి స్థానంలో కవిత తెలంగాణ రాష్ట్ర సేన ఏర్పాటు చేశారని ఎద్దేవా చేసింది. కాగా వైఎస్​ఆర్​టీపీ షర్మిల కాంగ్రెస్​లో విలీనం చేసిన విషయం తెలిసిందే.

Kavitha Party Controversy | బీఆర్​ఎస్​కు షాక్​

కవిత పార్టీతో బీఆర్​ఎస్​కు షాక్​ ఇచ్చారు. ఇటీవల కేటీఆర్​ పార్టీ పేరును మళ్లీ టీఆర్​ఎస్​గా మారుస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే కవిత తన పార్టీ పేరులో టీఆర్​ఎస్​ (TRS) వచ్చేలా తెలంగాణ రాష్ట్ర సేన అని ప్రకటించడం గమనార్హం. రాష్ట్రంలో ప్రజలు ఇప్పటికే గులాబీ పార్టీని టీఆర్​ఎస్​ అనే పిలుస్తారు. బీఆర్ఎస్​ అని చాలా మంది పలకరు. ఈ క్రమంలో టీఆర్​ఎస్​ పార్టీ పేరుతో కవిత బీఆర్​ఎస్​కు నష్టం చేకూర్చే అవకాశం ఉంది.

Kavitha Party Controversy | బీఆర్ఎస్​ శ్రేణుల విమర్శలు

కవిత తన ప్రసంగంలో కేసీఆర్​ (KCR) , బీఆర్ఎస్​పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో బీఆర్​ఎస్​ నాయకులు ఆమెపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ఈ రోజు పార్టీ ఏర్పాటు సందర్భంగా అన్ని పత్రికల్లో ఫుల్​ పేజీ యాడ్స్​ ఇచ్చారు. వాటికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ‘ఇంటిపేరు సార్ ఇచ్చిందే.. పార్టీ పేరు సార్ పెట్టింది కొద్దిగా మార్చి కాపీ చేసుకున్నావ్ అంతే’’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. గతంలో తెలంగాణలో అనేక పార్టీలు వచ్చి కాలగర్భంలో కలిసిపోయాయని, ఈ పార్టీ కూడా అంతే అని పోస్టులు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Kavitha Criticizes KCR | అవినీతి పందికొక్కుల్ని పక్కన పెట్టుకున్న కేసీఆర్​ : కవిత

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....