అక్షరటుడే, వెబ్డెస్క్: Weather Update | మురాసు తుపాన్ ప్రభావంతో తెలంగాణ (Telangana)లోని పలు జిల్లాల్లో మంగళవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఇప్పటికే 200 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.
భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో బుధవారం సైతం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఖమ్మం, ములుగు, మహబూబాబాద్ జిల్లాలలోని కొన్ని ప్రాంతాల్లో సైతం భారీ వర్షాలు పడుతాయి. భూపాలపల్లి, వరంగల్, సూర్యాపేట, హన్మకొండ, జనగామ, నల్గొండ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు జల్లులు కురుస్తాయి.
Weather Update | వర్షపాతం వివరాలు
తుపాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో 231 మి.మీ. వర్షపాతం నమోదు అయింది. దమ్మపేట 214, ఖమ్మం జిల్లా వేమ్సూరు 196.5, సత్తుపల్లిలో 188 మి.మీ. వర్షం కురిసింది. ఈ రెండు జిల్లాల్లో భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Indira Gandhi statue | కామారెడ్డిలో ఇందిరాగాంధీ విగ్రహ ధ్వంసానికి యత్నం: సోషల్ మీడియాలో వీడియో వైరల్!