Telangana EHS Health Cards | 15 నుంచి ఉద్యోగుల హెల్త్ స్కీం (EHS) అమలు.. త్వరలోనే సీఎం చేతుల పంపిణీ

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana EHS Health Cards | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS) కింద హెల్త్ కార్డులను జులై 15, 2026 నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధ్యక్షతన నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో నిర్ణయించారు.

Telangana EHS Health Cards | 13న మార్గదర్శకాలపై చర్చ

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా త్వరలో ఉద్యోగులకు హెల్త్ కార్డులను అధికారికంగా పంపిణీ చేయనున్నట్లు సమావేశంలో వెల్లడించారు.

ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన, నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు ఈ హెల్త్ కార్డు విధానం ఉపయోగపడుతుందని సమావేశంలో అభిప్రాయపడుతూ, అమలుకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.

Ganjani Mafia Hyderabad | గంజాయి కలకలం.. చిన్నారులే లక్ష్యంగా మత్తు వ్యాపారం.. ఈగల్‌ ఫోర్స్‌ ఆపరేషన్‌లో సంచలన విషయాలు వెలుగులోకి!

tg 1

Telangana EHS Health Cards | క్యూఆర్​ కోడ్​తో కార్డు డౌన్​లోడ్​..

క్యూఆర్ కోడ్ తో నూతన హెల్త్ కార్డులు మొబైల్ నుంచి డౌన్​లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరకు అన్ని వివరాలతో EHCT యాప్ రూపొందిస్తారు. ఇక చికిత్సలకు CGHS రేట్లు వర్తింపజేస్తారు. త్వరలోనే నూతన EHS మార్గదర్శకాల జీవో విడుదల చేస్తారు.

రాష్ట్ర వ్యాప్తంగా 943 హాస్పిటల్స్ లో హెల్త్ కార్డులపై నగదు రహిత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. 2594 ప్రొసీజర్స్ కవర్ అవుతాయి. నూతన EHS మార్గదర్శకాలపై చర్చ కోసం సోమవారం (13.07.2026) CEO తో సమావేశం ఉంటుంది.

 

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *