అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nov 04 Market Analysis | ఏఐ దిగ్గజాలు పుంజుకోవడంతో మంగళవారం నాస్‌డాక్(Nasdaq) లాభాలతో ముగిసింది. అయితే అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతుండడం, డెమోక్రాట్లకు బలమైన మద్దతు లభిస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో ఫ్యూచర్స్ నష్టాల బాటలో సాగుతున్నాయి. బుధవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు(Asian markets) ఎరుపెక్కాయి.
Nov 04 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో నాస్‌డాక్ 0.83 శాతం, ఎస్ అండ్ పీ 0.37 శాతం లాభపడగా.. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.63 శాతం నష్టంతో ఉంది.
Nov 04 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.45 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.34 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 1.16 శాతం నష్టంతో ముగిశాయి.
Nov 04 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.03 శాతం లాభంతో ఉండగా.. జపాన్‌కు చెందిన నిక్కీ 3.57 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 2.19 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.87 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.62 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.12 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.20 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభం కానున్నాయి.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
గమనించాల్సిన అంశాలు..
- విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా 3వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులు ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 6,836 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- డీఐఐలు చాలాకాలం తర్వాత వరుసగా 3వ సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా నిలిచారు. రూ. 3,678 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 17 పైసలు బలపడి 94.74 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 101.39 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.90 శాతం వద్ద ఉంది.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.40 నుంచి 1.20 కు తగ్గింది.
- విక్స్ 1.44 శాతం పెరిగి 15.72 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 103.02 డాలర్ల వద్ద ఉంది.