Stock Market Closing Today | హెవీవెయిట్‌ స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతు.. లాభాలతో ముగిసిన ప్రధాన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 273 పాయింట్లు, నిఫ్టీ 67 పాయింట్లు పెరిగాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Closing Today | పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలతో క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధర పెరుగుతోంది. దీంతో ద్రవ్యోల్బణ భయాలతో వచ్చే సమావేశంలో అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో గ్లోబల్ మార్కెట్లు ప్రతికూలంగా స్పందిస్తున్నాయి. అయితే మన మార్కెట్లు మాత్రం రిలయన్స్, HDFC బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి కొన్ని హెవీవెయిట్‌ల మద్దతుతో పాజిటివ్‌గా ముగిసింది. మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ మాత్రం నష్టాలతో ముగిశాయి.

Stock Market Closing Today | ఫ్లాట్ గా ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైంది. సెన్సెక్స్ 16 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 198 పాయింట్లు తగ్గినా.. అక్కడినుంచి కోలుకుని 567 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ ఒక పాయింటు నష్టంతో ప్రారంభమై మరో 62 పాయింట్లు క్షీణించింది. అక్కడినుంచి 155 పాయింట్లు ఎగబాకింది. చివరికి సెన్సెక్స్ 273 పాయింట్ల లాభంతో 77,928 వద్ద, నిఫ్టీ 67 పాయింట్ల లాభంతో 24,317 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Closing Today | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,691 కంపెనీలు లాభపడగా 2,528 స్టాక్స్ నష్టపోయాయి. 188 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 120 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 79 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 15 స్టాక్ లాభపడగా.. 15 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. మారుతి 1.77 శాతం, ఎం అండ్ ఎం 1.73 శాతం, రిలయన్స్ 1.44 శాతం, ఎస్బీఐ 1.22 శాతం, HDFC బ్యాంక్ 1.06 శాతం లాభపడ్డాయి.

Top Losers : అదానీపోర్ట్స్ 3.26 శాతం, ఇండిగో 0.87 శాతం, బజాజ్ పిన్‌సర్వ్ 0.83 శాతం, బీఈఎల్ 0.74 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.57 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: MV Electrosystems IPO | పబ్లిక్ ఇష్యూకు మరో కంపెనీ.. జీఎంపీ ఎంతంటే?

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *