అక్షరటుడే, ఇందూరు: Nizamabad Rain Alert | రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ (MLA Dhanpal) సూర్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది నగరవాసులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
Nizamabad Rain Alert | శానిటేషన్ సిబ్బంది..
ప్రధానంగా శానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు డ్రైనేజీలను శుభ్ర పర్చాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిండకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్, ఉన్నతాధికారులతో పాటు సంబంధిత విభాగాధిపతులు సిబ్బందితో సమాచారం తెలుసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పారు. నాలాలు సరిగా లేనిచోట ముంపు సమస్య తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో వర్షపు నీరు చేరి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. అధిక వర్షపాతం నమోదైనప్పుడు నాలాలు వెంటనే శుభ్రం చేయాలన్నారు. నీరు నిండిన చోట తోడేందుకు భారీ మోటార్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అవసరమైతే ప్రత్యేక బృందాన్ని సిద్ధంగా ఉంచాలన్నారు.
ఇది కూడా చదవండి..: Fee Reimbursement Protest | ఫీజు బకాయిలు విడుదల చేయకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తాం..