Hyderabad Rain Tragedy | హైదరాబాద్​లో విషాదం.. భారీ వర్షానికి ఇద్దరి మృతి

హైదరాబాద్​ నగరంలో విషాదం చోటు చేసుకుంది. వర్షానికి విద్యుత్​ తీగలు తెగిపడటంతో షాక్​ కొట్టి ఇద్దరు మృతి చెందారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Rain Tragedy | హైదరాబాద్​ నగరంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి పలు చోట్ల చెట్లు కూలాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. బండ్లగూడలో వర్షానికి రోడ్డుపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. వాటికి తగలడంతో ఇద్దరు మృతి చెందారు.

చాంద్రాయణగుట్టకు చెందిన ఇద్దరు యువకులు కరెంట్‌ షాక్‌తో మృతి చెందారు. రోడ్డుపై తెగిపడిన కరెంట్‌ తీగలను గమనించకుండా.. ఆటోలో నుంచి దిగారు. దీంతో షాక్​ కొట్టి చనిపోయారు. మృతులను జాఫర్ (25), అబూ (16)గా గుర్తించారు.

Hyderabad Rain Tragedy | జలమయమైన రోడ్లు

నగరవ్యాప్తంగా భారీ వర్షం పడటంతో రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. దీంతో పలు చోట్ల ట్రాఫిక్​ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల చెట్లు నేలకూలాయి. నారాయణగూడలో చెట్లు పడి కార్లు, బైక్​లు ధ్వంసం అయ్యాయి.

heavy rain

Hyderabad Rain Tragedy | రంగంలోకి దిగిన హైడ్రా

భారీ వర్షాల నేపథ్యంలో హైడ్రా రంగంలోకి దిగింది. బేగంపేట్, ఖైరతాబాద్‌లలో దాదాపు 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ట్యాంక్‌బండ్, సచివాలయం ముందున్న రోడ్లపై నీరు నిలిచిపోవడంతో మోకాలి లోతు వరకు వరద నీరు చేరింది. దీంతో హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ట్యాంక్‌బండ్ వద్ద చెట్టు కూలిపోయింది ఘటనా స్థలాన్ని హైడ్రా కమిషనర్​ రంగనాథ్ పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. సుమారు 76 ప్రాంతాలలో చెట్లు కూలిపోయినట్లు సమాచారం.

దీనిని కూడా చదవండి : Revanth Reddy Comments | వడ్లు, మక్కలతో సమస్యలు.. సీఎం రేవంత్​ కీలక వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *