అక్షరటుడే, కామారెడ్డి: Bakrid Wishes | భారతీయులందరూ కులమతాలకు అతీతంగా కలిసికట్టుగా దేశాభివృద్ధికి పాటుపడాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. బక్రీద్ సందర్భంగా కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని కోర్టు ఆవరణ ఈద్గాలో ప్రత్యేక నమాజ్ (Eid prayers) చేశారు. ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
Bakrid Wishes | ప్రతి ఇంట్లో శాంతి, సంతోషం ఉండాలి..
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ఈద్-ఉల్-అజ్హా పండుగ విశ్వాసం, త్యాగం, కరుణ, మానవత్వం వంటి గొప్ప విలువలను సమాజానికి గుర్తు చేస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఇంటిలో శాంతి, సంతోషం, ఐశ్వర్యం, సౌభ్రాతృత్వం నిండాలని ఆకాంక్షించారు. సమాజ సేవ, ఐక్యత, సోదరభావం వంటి విలువలను ప్రతి ఒక్కరూ బలోపేతం చేసుకోవాలని కోరారు. భారతదేశం గంగా-జమునా తహజీబ్ – భిన్నత్వంలో ఏకత్వం అనే సాంప్రదాయంతో వర్ధిల్లుతోందన్నారు. ఆవును దేశ జాతీయ జంతువుగా ప్రకటించాలని దేశ ముస్లిం మత పెద్దలు చేసిన విజ్ఞప్తికి మహమ్మద్ అలీ షబ్బీర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, మత పెద్దలు, పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు.
Bakrid Wishes | శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ రాజేష్ చంద్ర
బక్రీద్ పండగ సందర్భంగా ఈద్గా వద్ద నిర్వహించిన బక్రీద్ వేడుకలను ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandr) పరిశీలించారు. పండుగ సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన భద్రతా, బందోబస్తు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈద్గాకు ప్రార్థనల నిమిత్తం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతలు, మరియు పార్కింగ్ వసతులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలోని అన్ని ఈద్గాలు, మసీదులలో బక్రీద్ ప్రత్యేక ప్రార్థనలు అత్యంత ప్రశాంత వాతావరణంలో, విజయవంతంగా ముగిశాయని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీని కలిసి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Bakrid wishes, Shabbir Ali, Kamareddy news, Eid celebrations, Telangana news, communal harmony, SP Rajesh Chandra, Eid prayers
ఇది కూడా చదవండి: Exhibitors Dispute | మెగాస్టార్ చొరవతో ‘ఎగ్జిబిటర్ల’ వివాదానికి పరిష్కారం


