CUET UG 2026 | సీయూఈటీ-యూజీ’ కొత్త పరీక్ష తేదీలు ఖరారు

Shivam nagarani

CUET UG 2026 | దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక కేంద్ర విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేట్ (UG) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘సీయూఈటీ-యూజీ 2026’ (CUET UG 2026) పరీక్షలకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ ప్రవేశ పరీక్షల సవరించిన షెడ్యూల్‌తో పాటు అడ్మిట్ కార్డులను (హాల్ టికెట్లను) అధికారికంగా విడుదల చేసింది. లక్షలాది మంది విద్యార్థులు రాయనున్న ఈ పరీక్షా ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఎన్‌టీఏ(NTA) అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

CUET UG 2026 | బక్రీద్ కారణంగా పరీక్షల వాయిదా..

నిజానికి పాత షెడ్యూల్ ప్రకారం ఇవాళ జరగాల్సిన పరీక్షను ‘ఈద్-ఉల్-అజ్హా’ (బక్రీద్) పండుగ కారణంగా ఎన్‌టీఏ వాయిదా వేసింది. పండుగ పూట అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సవరించిన షెడ్యూల్ ప్రకారం.. వాయిదా పడిన పరీక్షలను ఈ నెల (మే) 31వ తేదీన, అలాగే వచ్చే నెల (జూన్) 6, 7 తేదీలలో దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు.

ug

 

CUET UG 2026 | మే 31 అభ్యర్థుల హాల్ టికెట్లు లభ్యం..

మే 31వ తేదీన (ఆదివారం) జరగబోయే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల అడ్మిట్ కార్డులను ఎన్‌టీఏ తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ వివరాలను నమోదు చేసి వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక జూన్ 6, 7 తేదీల్లో పరీక్షలు రాయబోయే మిగిలిన విద్యార్థుల అడ్మిట్ కార్డులను కూడా త్వరలోనే విడుదల చేస్తామని ఎన్‌టీఏ స్పష్టం చేసింది.

CUET UG 2026 | అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం..

విద్యార్థులు తమ అడ్మిట్ కార్డును సులభంగా పొందడానికి మొదట అధికారిక వెబ్‌సైట్ cuet.nta.nic.in ను సందర్శించాల్సి ఉంటుంది. అనంతరం హోమ్‌పేజీలో కనిపించే ‘CUET UG Admit Card’ లింక్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్ , పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయగానే అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. భవిష్యత్ అవసరాల కోసం అభ్యర్థులు దీన్ని ప్రింట్ అవుట్ తీసుకుని భద్రపరచుకోవాలి.

ug 1

 

CUET UG 2026 | అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మండి..

దేశంలోనే అతిపెద్ద అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్షలలో ఒకటి కావడంతో, ఈ పరీక్షలకు సంబంధించి ఎలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అధికారులు కోరారు. పరీక్షకు సంబంధించిన తాజా అప్‌డేట్‌లు, నిబంధనలు , సమాచారం కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు క్రమం తప్పకుండా కేవలం ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే ఫాలో అవ్వాలని సూచించారు.

ఇది కూడా చదవండి:  BJP State Presidents | నాలుగు రాష్ట్రాలకు బీజేపీ అధ్యక్షుల నియామకం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *