BJP State Presidents | నాలుగు రాష్ట్రాలకు బీజేపీ అధ్యక్షుల నియామకం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BJP State Presidents | నాలుగు రాష్ట్రాలకు బీజేపీ నూతన అధ్యక్షులను నియమించింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, త్రిపుర రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

కేంద్ర సహాయ మంత్రి, ఎంపీ హర్ష్ మల్హోత్రా పార్టీ ఢిల్లీ (Delhi) విభాగానికి అధ్యక్షుడిగా నియమితులవ్వగా, హర్యానాలో బీజేపీకి నాయకత్వం వహించడానికి అర్చన గుప్తాను ఎంపిక చేశారు. త్రిపుర (Tripura)లో అభిషేక్ దేబ్రాయ్‌ను, పంజాబ్​లో కేవల్ సింగ్ దిల్లాన్‌ను నియమించింది. బీజేపీ నాయకత్వంలో జరగబోయే విస్తృత సంస్థాగత పునర్వ్యవస్థీకరణకు ఈ నియామకాలు నాందిగా భావిస్తున్నారు. రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలలో కొత్త కార్యవర్గ సభ్యుల ఎంపికకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నియామకాలన్నింటినీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ చేయగా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ నోటిఫికేషన్​ విడుదల చేశారు. ఈ నియామకాలన్నీ తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు.

BJP State Presidents | కొత్త అధ్యక్షుల నేపథ్యం

తొలిసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన హర్ష్ మల్హోత్రా, తన బలమైన సంస్థాగత నైపుణ్యాలకు, ఢిల్లీ రాజకీయాల్లో విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవానికి బీజేపీలో మంచి పేరు పొందారు. ఆయన ప్రస్తుతం కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల, రోడ్డు రవాణా & రహదారుల శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. లోక్‌సభలో తూర్పు ఢిల్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మల్హోత్రా గతంలో బీజేపీ ఢిల్లీ విభాగంలో ప్రధాన కార్యదర్శి సహా కీలక సంస్థాగత పదవులను నిర్వహించారు. 2012లో కౌన్సిలర్​గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన కేంద్రమంత్రిగా ఎదిగారు. తాజాగా ఢిల్లీ పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

harsh malhotra

BJP State Presidents | పంజాబ్​లో..

బర్నాలా మాజీ ఎమ్మెల్యే అయిన కేవల్ సింగ్ ధిల్లాన్ పంజాబ్ రాజకీయాల్లో అనుభవం ఉన్న నేత. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు సన్నిహితుడిగా పేరుంది. ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్ పార్టీతో ప్రారంభించి, 2022లో బీజేపీలో చేరారు. ఆయన 2022లో సంగ్రూర్ లోక్‌సభ ఉప ఎన్నిక, 2024 బర్నాలా అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఆయనకు బీజేపీ రాష్ట్ర బాధ్యతలు అప్పగించింది.

BJP State Presidents | హర్యానాలో..

archana gupta

పానిపట్‌కు చెందిన అర్చన గుప్తా హర్యానా బీజేపీ ప్రెసిడెంట్​గా నియామకం అయ్యారు. గతంలో ఆమె రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. త్రిపుర పగ్గాలను పార్టీ అభిషేక్ డెబ్రాయ్​కు అప్పగించింది. ఆయన , 2023 త్రిపుర శాసనసభ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ‘మాతర్‌బారి’ నియోజకవర్గం నుండి BJP అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ప్రణజిత్ రాయ్‌పై విజయం సాధించారు.

దీనిని కూడా చదవండి : Siddaramaiah Resignation | మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నా : సిద్దరామయ్య

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *