Bakrid Celebrations | జిల్లాలో ఘనంగా బక్రీద్​.. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు..

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Bakrid Celebrations | జిల్లాలో బక్రీద్​ను (Bakrid) గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే ఉద్గాల వద్దకు వెళ్లి ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించారు.

Bakrid Celebrations | ఖిల్లా ఈద్గా వద్ద..

నగరంలోని (Nizamabad City) ఖిల్లా ఈద్గా వద్ద మున్సిపల్​ కార్పొరేషన్​ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఈద్గా అధ్యక్షుడు అబ్దుల్​ రహ్మాన్​, మెంబర్​ ఎహశాన్​ పాషా, ట్రెజరర్​ ఇనాయత్​ అలీ, మోల్​సాబ్​ ముఫ్తీ సయీద్​ అక్బర్​ ఆధ్వర్యంలో ప్రార్థనలు జరిగాయి. ఎండాకాలం దృష్ట్యా ప్రత్యేకంగా షామియానాలు వేసి, తాగునీటి సౌకర్యం కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధంగా అంబులెన్స్​ను ఉంచారు. సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) ఆధ్వర్యంలో పోలీస్​ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయా ప్రార్థనా స్థలాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది పహారా కాశారు. ఈ సందర్భంగా సీపీ ఖిల్లా ఈద్గా, బోధన్​లోని ఈద్గాలను సందర్శించి బందోబస్తును పర్యవేక్షించారు.

bak1 bak2 bak3 bak5

ఇది కూడా చదవండి: Dong Gongping Escape | రబ్బరు బోటులో 30 గంటల జర్నీ.. చైనా మాజీ పోలీస్ సాహసం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *