Bakrid Bandobast | బక్రీద్ పండుగ బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించిన సీపీ సాయి చైతన్య

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Bakrid Bandobast | బక్రీద్​ను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సీపీ సాయిచైతన్య (cp sai chaitanya) పేర్కొన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ (Nizamabad Police Commissionerate) పరిధిలోని నిజామాబాద్ (nizamabad), ఆర్మూర్, బోధన్ డివిజన్లలో పండుగ సందర్భంగా పోలీస్​శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టిందన్నారు.

Bakrid Bandobast | బందోబస్తు పరిశీలన..

ఈ సందర్భంగా 5వ టౌన్​ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్ ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను సీపీ సాయిచైతన్య పర్యవేక్షించారు. ఈద్గా పరిసర ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, భక్తుల రాకపోకలు, సీసీ కెమెరాల పనితీరు తదితర అంశాలను కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పండుగకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.

అలాగే ప్రజలు పరస్పర సహకారంతో పండుగను సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కమిషనర్ గారు సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, హోంగార్డ్ ఏసీపీ దీపక్ చంద్ర, సీఐలు, ఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

lic 1

బోధన్​లో బందోబస్తు పరిశీలన..

అక్షరటుడే, బోధన్: బక్రీద్​ పండుగ సందర్భంగా బోధన్​లో బందోబస్తును సీపీ సాయిచైతన్య పరిశీలించారు. ఈ మేరకు బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సి రోడ్డు ఈద్గాను గురువారం సందర్శించారు. ఈద్గా పరిసర ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లు , ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, భక్తుల రాకపోకలు, సీసీ కెమెరాల పనితీరు తదితర అంశాలను కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పండుగకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీటీసీ ఏసీపీ రాజశేఖర్, టౌన్ ఎస్​హెచ్​వో వెంకట్ నారాయణ, సీఐలు, ఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Cow National Animal | ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి: ముస్లిం సంఘాలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *