తెలంగాణCow National Animal | ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి: ముస్లిం సంఘాలు

Cow National Animal | ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి: ముస్లిం సంఘాలు

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ముస్లిం సంఘాలు కోరాయి. ఈ మేరకు బక్రీద్​ పండుగ వేళ సిరిసిల్లలో ముస్లింలు ప్రకార్డులు ప్రదర్శించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cow National Animal | ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ముస్లిం సంఘాలు కోరాయి. ఈ మేరకు బక్రీద్​ పండుగ వేళ గురువారం సిరిసిల్లలో ముస్లింలు ప్రకార్డులు ప్రదర్శించారు.

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కొన్నేళ్లుగా హిందువులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ డిమాండ్​కు ముస్లింలు మద్దతు తెలపడం గమనార్హం. దేశవ్యాప్తంగా పలు ముస్లిం సంఘాలు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్​ చేస్తున్నాయి. అలా చేస్తే గో సంరక్షణ చట్టాల్లో ఏకరూపతకు దారితీయడంతోపాటు గో సంరక్షకుల ముసుగులో సాగుతున్న హింసకు అడ్డుకట్ట పడుతుందని పేర్కొంటున్నాయి. బక్రీద్​ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఆవులను వధిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ముస్లిం సంఘాల ప్రతినిధులు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్​ చేయడం గమనార్హం.

cows

Cow National Animal | మాజీ ఉపరాష్ట్రపతి సైతం

ఆవుకు జాతీయ జంతువు హోదా కల్పించాలని జమియత్‌ ఉలేమా-ఎ-హింద్‌ అధ్యక్షుడు మౌలానా అర్షద్‌ మదానీ ఇటీవల డిమాండ్​ చేశారు. ఈ ప్రతిపాదనకు మాజీ ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ మద్దతు తెలిపారు. ఆవును బలి ఇవ్వాలని ఏ మత గ్రంథమూ చెప్పడం లేదన్నారు. ఢిల్లీలో ముస్లిం సంఘాల సదస్సు ఏర్పాటు చేసి ఆవును జాతీయ జంతువుగా గుర్తించాలంటూ మోదీకి వినతి పత్రం అందిస్తామని మౌలానా షహబుద్దీన్‌ రజ్వీ తెలిపారు.

దీనిని కూడా చదవండి : Telangana Tahsildars Transfer | తెలంగాణలో 12 మంది తహసీల్దార్ల బదిలీ : రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

May 30 Horoscope | కష్టాలకు ఇక ఎండ్​ కార్డ్​.. ఈ రాశుల వారికి నేడు ఆకస్మిక ధన యోగం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 30 Horoscope | గ్రహాల సంచారంలో వస్తున్న...

Minister Quarters Swimming Pool | ఒలింపిక్స్‌లో ‘మినిస్టర్’ మెడల్ పక్కా? క్వార్టర్స్‌లో రూ.2.63 కోట్లతో స్విమ్మింగ్ పూల్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Minister Quarters Swimming Pool | తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను...

Japan Population Crisis | సూర్యుడు ఉదయించే దేశంలో.. శృంగార అస్తమయం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Japan Population Crisis | జపాన్.. సాంకేతికతకు మారుపేరు....

VH Criticizes Congress Ministers | మంత్రులూ.. పద్ధతి మార్చుకోండి: సొంత ప్రభుత్వంపై ‘వీహెచ్‌’ ఫైర్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: VH Criticizes Congress Ministers | తెలంగాణ రాష్ట్రంలో అధికార...