అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BRS MLAs Arrest | అసెంబ్లీ గేట్ వద్ద సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన విఫలమైందని బీఆర్ఎస్ సభ్యులు గన్‌పార్క్ వద్ద నిరసన తెలిపారు. నల్ల టీ షర్టులు ధరించి అసెంబ్లీలోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట చోటు చేసుకుంది.
BRS MLAs Arrest | కేటీఆర్‌కు గాయం
పోలీసులతో జరిగిన తోపులాటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుదుటికి, చేతికి గాయం అయింది. మాజీ మంత్రి హరీశ్‌రావు సైతం కింద పడ్డారు. దీంతో హరీశ్‌రావు (Harish Rao) తన చొక్కా విప్పేసి నిరసన తెలిపారు. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. రాహుల్ గాంధీ టీషర్టుతో పార్లమెంట్‌కు వెళ్లలేదా అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
BRS MLAs Arrest | కన్నీరు పెట్టుకున్న సునీతా లక్ష్మారెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు అవమానకరంగా ప్రవర్తించారని ఆమె పేర్కొన్నారు. తన చీర లాగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు అని కూడా చూడకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తారా అంటూ కన్నీరు పెట్టుకున్నారు.
ప్రజా సమస్యల మీద కొట్లాడేందుకు గన్‌పార్క్ నుంచి అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
నల్ల టీషర్టులు, ప్లకార్డులతో వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు వద్దే అడ్డుకున్న పోలీసులు.
నల్ల టీషర్టులతో సభలోకి అనుమతి లేదంటూ అప్రజాస్వామికంగా వ్యవహరించిన పోలీసులు.
రాహుల్ గాంధీ… pic.twitter.com/Qz0J5JgL9M
— Office of Harish Rao (@HarishRaoOffice) September 7, 2026
ఇది కూడా చదవండి..: Telangana Assembly Sessions | రాజకీయ సమరం.. ప్రజా సమస్యలకు గ్రహణం.. అసెంబ్లీ వేదికగా మళ్లీ తిట్ల పర్వమేనా?