అక్షరటుడే వెబ్‌డెస్క్: Retired Teacher Suicide | పదవీ విరమణ పొందిన తర్వాత హాయిగా గడపాల్సిన ఆ వృద్ధాప్యంలో, ఆర్థిక కష్టాలు, మానసిక ఒత్తిడి ఓ రిటైర్డ్ టీచర్ ప్రాణాలను బలిగొన్నాయి. జనగామకు చెందిన పగిడిపల్లి మల్లయ్య అనే రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
Retired Teacher Suicide | రెండేళ్లుగా పెండింగ్‌లోనే ..
మల్లయ్య 2024లో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పదవీ విరమణ చేశారు. రిటైర్మెంట్ తర్వాత రావాల్సిన పూర్తి బెనిఫిట్స్ రాకపోవడంతో ఆయన గత రెండేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధుల కోసం ఆయన కోర్టును కూడా ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో కొంత మొత్తం విడుదలైనా, మిగిలిన బకాయిలు పెండింగ్‌లోనే ఉండిపోయాయి. దీనివల్ల ఆర్థిక పరిస్థితి రోజురోజుకీ దిగజారి, తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
Retired Teacher Suicide | 33 పేజీల సూసైడ్ నోట్..
మల్లయ్య మరణానికి ముందు ఏకంగా 33 పేజీల సూసైడ్ నోట్ రాయడం కలకలం రేపింది. ఈ నోట్‌లో తన చావుకు గల కారణాలను, తనను వేధిస్తున్న అప్పుల వివరాలను ఆయన స్పష్టంగా పేర్కొన్నట్లు సమాచారం. ప్రధానంగా తన బావమరుదులు గుంటి రత్నాకర్, మనోహర్ పేర్లను ఆయన అందులో ప్రస్తావించారు. బంధువులు, ఇతరులకు మధ్యవర్తిగా ఉండి లక్షల రూపాయల అప్పులు ఇప్పించిన మల్లయ్య, అవి తిరిగి రాకపోయేసరికి అప్పు ఇచ్చిన వారి నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు. తాను నమ్మి ఇప్పించిన అప్పులు తిరిగి రాకపోవడం, తన రిటైర్మెంట్ సొమ్ము కూడా చేతికి అందకపోవడంతో ఆయన తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు.
Retired Teacher Suicide | పోలీసుల దర్యాప్తు..
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, మల్లయ్య రాసిన 33 పేజీల సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రిటైర్డ్ టీచర్ ఆత్మహత్య స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
రిటైర్డ్ టీచర్ ఆత్మహత్య.. తన చావుకు ప్రభుత్వం, బావమరిది కారణమని సూసైడ్ నోట్
జనగామకు చెందిన రిటైర్డ్ టీచర్ పగిడిపల్లి మల్లయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన చావుకు తన బావమరిదితో పాటు ప్రభుత్వం కారణమని సూసైడ్ నోట్ రాశాడు. తన బావమరిది నుంచి… pic.twitter.com/SuOfr3FJl7
— Akshara Today | Telugu News (@aksharatoday) July 7, 2026
ఇది కూడా చదవండి: Modi Indonesia Award | ఇండోనేషియా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ప్రధాని మోదీ