RERA Chairman Notification | ‘రెరా ఛైర్మన్’ నియామకానికి నోటిఫికేషన్..

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RERA Chairman Notification | తెలంగాణ రియల్ ఎస్టేట్ నియంత్రణ మండలి(టీజీరెరా) ఛైర్మన్ పోస్టు భర్తీ చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 8వ తేదిలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా (Hyderabad Metropolitan Area), అర్బన్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆఫీసులో దరఖాస్తులు అందజేయాలి. మొన్నటి వరకు రెరా ఛైర్మన్​గా కొనసాగిన ఎన్. సత్యనారాయణ(రిటైర్డ్ ఐఏఎస్) అనారోగ్య కారణాలతో రాజీనామా చేశారు. దీంతో పోస్ట్ ఖాళీ అయింది. దీంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డెవలప్​మెంట్ డిపార్ట్​మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జయేష్ రంజన్​కు ఇన్​ఛార్జి బాధ్యతలు అప్పగించారు. తాజాగా పూర్తి స్థాయి ఛైర్మన్ పోస్టు భర్తీచేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది.

RERA Chairman Notification | వీరు అర్హులు..

RERA Chairman Notification

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అడిషనల్ సెక్రెటరీగా పనిచేసిన అనుభవం/ సమానమైన హోదా కల్గినవారు రెరా ఛైర్మన్​గా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్బన్ డెవలప్‌మెంట్, హౌసింగ్, రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎకనామిక్స్, ప్లానింగ్, లా, కామర్స్, అకౌంటెన్సీ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రంగాలలో కనీసం 20 ఏళ్ల అనుభవం ఉండాలి. ఈ పోస్టు పదవి కాలం ఐదేళ్లు. ఛైర్మన్​కు నెలకు రూ. 1.50లక్షల వేతనం, ఇంటి అద్దె భత్యం కింద రూ. 50వేలు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాహన సదుపాయం కల్పిస్తారు.
రెరా ఛైర్మన్​ కోసం వచ్చిన దరఖాస్తులను తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టీస్ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలిస్తుంది. అనంతరం ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

RERA Chairman Notification

ఇది కూడా చదవండి..: Rain Forecast | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *